Neevemi baasagomtivo neemaada javadaamtadu(mdu?)

నీవేమి బాసగొంటివో నీమాట జవదాఁటదు(ఁడు?)
Language

(॥పల్లవి॥)
నీవేమి బాసగొంటివో నీమాట జవదాఁటదు(ఁడు?)
యీవల మమ్ము నిట్టే యేలుమనవమ్మా

(॥నీవే॥)
విప్పుచు నాకుఁగాను విన్నపాలు సేయవమ్మ
చెప్పినట్టెల్లానీకుఁ జేసునాతఁడు
యెప్పుడునుఁ బ్రేమతో మాఇంటికి రమ్మనవమ్మ
అప్పణ నీవిచ్చితేను ఆదరించు నన్నును

(॥నీవే॥)
పొందు మాతోఁ జేయుమని బుద్దులుచెప్పఁగదమ్మ
అంది నీచేతిలోనివాఁడైనాఁ డాతఁడు
మందలించి మాతోను మాటలాడుమనవమ్మ
యెందు నీకు వయసు మీఁదెత్తుకున్నాఁ డతఁడు

(॥నీవే॥)
బలువై నన్నుఁ బాయరాకుండుమనవమ్మ
వొలిసి నిన్ను మరిగివున్నాఁ డతఁడు
అలమేలుమంగ వింకా నతని వేఁడుకొవమ్మ
వెలయ నన్నేలె శ్రీవేంకటేశుఁడతఁడు

(||pallavi||)
nīvemi bāsagŏṁṭivo nīmāḍa javadām̐ṭadu(m̐ḍu?)
yīvala mammu niṭṭe yelumanavammā

(||nīve||)
vippusu nāgum̐gānu vinnabālu seyavamma
sĕppinaṭṭĕllānīgum̐ jesunādam̐ḍu
yĕppuḍunum̐ bremado māiṁṭigi rammanavamma
appaṇa nīvichchidenu ādariṁchu nannunu

(||nīve||)
pŏṁdu mādom̐ jeyumani buddulusĕppam̐gadamma
aṁdi nīsedilonivām̐ḍainām̐ ḍādam̐ḍu
maṁdaliṁchi mādonu māḍalāḍumanavamma
yĕṁdu nīgu vayasu mīm̐dĕttugunnām̐ ḍadam̐ḍu

(||nīve||)
baluvai nannum̐ bāyarāguṁḍumanavamma
vŏlisi ninnu marigivunnām̐ ḍadam̐ḍu
alamelumaṁga viṁkā nadani vem̐ḍugŏvamma
vĕlaya nannelĕ śhrīveṁkaḍeśhum̐ḍadam̐ḍu