నీవేల సిగ్గువడేవు నెట్టన నన్నుఁ జూచి
(॥పల్లవి॥)
నీవేల సిగ్గువడేవు నెట్టన నన్నుఁ జూచి
భావించ నీవన్నిటా పంతగాఁడవు
(॥నీవే॥)
తగవులఁబెట్టేనా తారుకాణించవచ్చేనా
జిగి నీవు సేసినచేఁతలకెల్లా
అగడు నేఁ జేసేనా అంతటా నాడుకొనేనా
పగటుతో నీవేమిటాఁ బరగినను
(॥నీవే॥)
నెరసులు వెదకేనా నిఘ్టారము వేసేనా
నిరతపునాజవైననీమీఁదను
యెరవులు సేసేనా యెగ్గులు నేఁ బట్టేనా
సరస మెవ్వతెతోడ సారె నీవాడినను
(॥నీవే॥)
చలము సాదించేనా జంకించి పెనఁగేనా
నిలువెల్లాఁ దమిరేఁగి నీవుండినా
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
అలమేలుమంగ నింతె అవుఁగాదనేనా
(||pallavi||)
nīvela sigguvaḍevu nĕṭṭana nannum̐ jūsi
bhāviṁcha nīvanniḍā paṁtagām̐ḍavu
(||nīve||)
tagavulam̐bĕṭṭenā tārugāṇiṁchavachchenā
jigi nīvu sesinasem̐talagĕllā
agaḍu nem̐ jesenā aṁtaḍā nāḍugŏnenā
pagaḍudo nīvemiḍām̐ baraginanu
(||nīve||)
nĕrasulu vĕdagenā nighṭāramu vesenā
niradabunājavainanīmīm̐danu
yĕravulu sesenā yĕggulu nem̐ baṭṭenā
sarasa mĕvvadĕdoḍa sārĕ nīvāḍinanu
(||nīve||)
salamu sādiṁchenā jaṁkiṁchi pĕnam̐genā
niluvĕllām̐ damirem̐gi nīvuṁḍinā
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
alamelumaṁga niṁtĕ avum̐gādanenā