Neevela sigguvadevu nememanemu ninnu

నీవేల సిగ్గువడేవు నేమేమనేము నిన్ను
Language

(॥పల్లవి॥)
నీవేల సిగ్గువడేవు నేమేమనేము నిన్ను
వావి గూడితేఁజాలు వదలకువయ్య

(॥నీవే॥)
వొల్లనే యిచ్చకమాడి వొడఁబరచీ నిన్ను
వెల్లవిరిగా నీవు వినవయ్య
చల్లుఁజూపులనుఁ జూచి సారెఁ దమకము రేఁచీ
అల్లదే లొనుగావయ్య ఆపెకు నేఁడు

(॥నీవే॥)
సంగతిగా మోవి చూపి చవులువుట్టించీ నీకు
అంగవించి వేడుకతో నందుకోవయ్య
సింగారించుకవున్నది చిఱునవ్వు నవ్వి నీతో
సంగడిఁ బెట్టుక నీవు చనవియ్యవయ్యా

(॥నీవే॥)
వూరకే నీ కెదురుగా నొడ్డుకున్నది గుబ్బలు
నేరుపుతోఁ గాఁగిట నించుకోవయ్యా
యీరీతి శ్రీవేంకటేశ యేనలమేలుమంగను
చేరి నన్నేలితి వాపెఁ జేసుకోవయ్య

(||pallavi||)
nīvela sigguvaḍevu nememanemu ninnu
vāvi gūḍidem̐jālu vadalaguvayya

(||nīve||)
vŏllane yichchagamāḍi vŏḍam̐barasī ninnu
vĕllavirigā nīvu vinavayya
sallum̐jūbulanum̐ jūsi sārĕm̐ damagamu rem̐sī
allade lŏnugāvayya ābĕgu nem̐ḍu

(||nīve||)
saṁgadigā movi sūbi savuluvuṭṭiṁchī nīgu
aṁgaviṁchi veḍugado naṁdugovayya
siṁgāriṁchugavunnadi siṟunavvu navvi nīdo
saṁgaḍim̐ bĕṭṭuga nīvu sanaviyyavayyā

(||nīve||)
vūrage nī kĕdurugā nŏḍḍugunnadi gubbalu
nerubudom̐ gām̐giḍa niṁchugovayyā
yīrīdi śhrīveṁkaḍeśha yenalamelumaṁganu
seri nannelidi vābĕm̐ jesugovayya