నీవేల సిగ్గువడేవు నెలఁతతోను
(॥పల్లవి॥)
నీవేల సిగ్గువడేవు నెలఁతతోను
వావు లిద్దరికిఁ గూడె వద్దికి రావయ్యా
(॥నీవే॥)
సలుపుఁ జూపులఁ జూచి సారెఁ దప్పించుకొమ్మంటా
కలువరేకుల వేసీఁ గామిని
చెలప చెమట గోరఁ జిమ్మి చిమ్మి నీ మీఁద
వలపులు చల్లీని వద్దికి రావయ్యా
(॥నీవే॥)
ముప్పిరి నవ్వులు నవ్వి దప్పి దేర్చుమని
కప్పురము పైఁజల్లీ కలికి
కప్పినగుబ్బలమీఁది కస్తూరి నీమేనఁ బూసి
చిప్పిలఁగఁ దమి రేఁచీఁ జిత్తగించవయ్యా
(॥నీవే॥)
అక్కరతోఁ గాఁగిలించి అలయకు మనుచును
పుక్కిటివిడె మిచ్చీఁ బొలఁతి
యిక్కడ శ్రీవేంకటేశ యింతి నిట్టె యేలితివి
యెక్కె నీవురముమీఁద నిదె మెచ్చవయ్యా
(||pallavi||)
nīvela sigguvaḍevu nĕlam̐tadonu
vāvu liddarigim̐ gūḍĕ vaddigi rāvayyā
(||nīve||)
salubum̐ jūbulam̐ jūsi sārĕm̐ dappiṁchugŏmmaṁṭā
kaluvaregula vesīm̐ gāmini
sĕlaba sĕmaḍa goram̐ jimmi simmi nī mīm̐da
valabulu sallīni vaddigi rāvayyā
(||nīve||)
muppiri navvulu navvi dappi dersumani
kappuramu paim̐jallī kaligi
kappinagubbalamīm̐di kastūri nīmenam̐ būsi
sippilam̐gam̐ dami rem̐sīm̐ jittagiṁchavayyā
(||nīve||)
akkaradom̐ gām̐giliṁchi alayagu manusunu
pukkiḍiviḍĕ michchīm̐ bŏlam̐ti
yikkaḍa śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ yelidivi
yĕkkĕ nīvuramumīm̐da nidĕ mĕchchavayyā