Neevela sigguvadevu neegu vehimche nidamdu

నీవేల సిగ్గువడేవు నీకు వెూహించె నితఁడు
Language

(॥పల్లవి॥)
నీవేల సిగ్గువడేవు నీకు వెూహించె నితఁడు
చేవదేర పొందుసేసి సేసచల్లఁగదవే

(॥॥)
పరగ నీదిక్కు తప్పకచూచీ నితఁడు
గరిమ నీవేళనే కానుకియ్యవే
సరసము లప్పటిని సారె సారె నాడీని
తెరలోనికిఁ బిలిచి తేనేమో వొసగవే

(॥॥)
ననువునఁ దమి రేఁచి నవ్వులు నవ్వీ నితఁడు
మనసు రంజిల్ల మర్మము లంటవే
పెనఁగుచు నింతలోనే ప్రియములు వచరించీ
చనుఁగన నప్పళించి జట్టిగొనఁనదవే

(॥॥)
వూరకే నీవొడివట్టి వుంకువవెట్టీ నితఁడు
గారవపుఁ గాఁగిటను కళరేఁచవే
కోరి విజనగరపుకోనేటి శ్రీ వేంకటేశుఁ
డీరీతి నిన్ను గూడె నిన్నిటాను మెచ్చవే

(||pallavi||)
nīvela sigguvaḍevu nīgu vĕూhiṁchĕ nidam̐ḍu
sevadera pŏṁdusesi sesasallam̐gadave

(||||)
paraga nīdikku tappagasūsī nidam̐ḍu
garima nīveḽane kānugiyyave
sarasamu lappaḍini sārĕ sārĕ nāḍīni
tĕralonigim̐ bilisi tenemo vŏsagave

(||||)
nanuvunam̐ dami rem̐si navvulu navvī nidam̐ḍu
manasu raṁjilla marmamu laṁṭave
pĕnam̐gusu niṁtalone priyamulu vasariṁchī
sanum̐gana nappaḽiṁchi jaṭṭigŏnam̐nadave

(||||)
vūrage nīvŏḍivaṭṭi vuṁkuvavĕṭṭī nidam̐ḍu
gāravabum̐ gām̐giḍanu kaḽarem̐save
kori vijanagarabugoneḍi śhrī veṁkaḍeśhum̐
ḍīrīdi ninnu gūḍĕ ninniḍānu mĕchchave