నీవేల సిగ్గువడేవు నేడిట్టే మా ముందరను
(॥పల్లవి॥)
నీవేల సిగ్గువడేవు నేడిట్టే మా ముందరను
చేపట్టి యాపె చనవు చెల్లించరాదా
(॥॥)
మలసి మలసి నీతో మాటలాడీ తనివోదు
తలయెత్తి నిన్నుఁ జూచీ తనివోదు
చెలరేఁగి సేవలెల్లాఁ జేసియునుఁ దనివోదు
యెలమి నాపెకోరికె యీడేరించరాదా
(॥॥)
అంటి ముట్టి చదురంగాలాడియునుఁ దనివోదు
దంటతనాన జంకించీ తనివోదు
నంటునను సారెసారె నవ్వియునుఁ దనివోదు
కంటగించకాకె బత్తి గైకొనఁగరాదా
(॥॥)
చేరి నీపైఁజేయి చాఁచి చెనకియుఁ దనివోదు
ధారుణిఁ జాగిలి మొక్కీ తనివోదు
యీరీతి శ్రీవేంకటేశ యెనసియుఁ దనివోదు
ఆరసి మమ్మేలితి వాపెను మెచ్చరాదా
(||pallavi||)
nīvela sigguvaḍevu neḍiṭṭe mā muṁdaranu
sebaṭṭi yābĕ sanavu sĕlliṁcharādā
(||||)
malasi malasi nīdo māḍalāḍī tanivodu
talayĕtti ninnum̐ jūsī tanivodu
sĕlarem̐gi sevalĕllām̐ jesiyunum̐ danivodu
yĕlami nābĕgorigĕ yīḍeriṁcharādā
(||||)
aṁṭi muṭṭi saduraṁgālāḍiyunum̐ danivodu
daṁṭadanāna jaṁkiṁchī tanivodu
naṁṭunanu sārĕsārĕ navviyunum̐ danivodu
kaṁṭagiṁchagāgĕ batti gaigŏnam̐garādā
(||||)
seri nībaim̐jeyi sām̐si sĕnagiyum̐ danivodu
dhāruṇim̐ jāgili mŏkkī tanivodu
yīrīdi śhrīveṁkaḍeśha yĕnasiyum̐ danivodu
ārasi mammelidi vābĕnu mĕchcharādā