Neevela siggubadevu nettanam dalavamchuga

నీవేల సిగ్గుపడేవు నెట్టనఁ దలవంచుక
Language

(॥పల్లవి॥)
నీవేల సిగ్గుపడేవు నెట్టనఁ దలవంచుక
భావించి భావించి నిన్నుఁ బైకొని మెచ్చీని

(॥నీవేల॥)
వాడలు దిరిగి నీవు వచ్చిన రాక చూచి
వేడుకలు వెదచల్లీ వెలఁది
జాడలతో నీ మోము చంద్రకళలు చూచి
వీడెపు నోటనే వేమారుఁ బొగడీని

(॥నీవేల॥)
వుదుటుఁ దమకమున వుండే నీవునికి చూచి
కదిసి నవ్వులు నవ్వీఁ గలికి
పొదిగిన నీ శిరసు పువ్వుల దండలు చూచి
యెదుట నిలుచుండి చేయెత్తి మొక్కీని

(॥నీవేల॥)
గక్కున వస్తా వచ్చి కాఁగిటఁ గూడఁగాఁ జూచి
చెక్కులు నొక్కీ నిన్నుఁ జెలియ
నిక్కి శ్రీవేంకటేశుఁడ నీ మన్ననలెల్లాఁ జూచి
పక్కన నీమీఁదటి పదాలు వాడీని

(||pallavi||)
nīvela siggubaḍevu nĕṭṭanam̐ dalavaṁchuga
bhāviṁchi bhāviṁchi ninnum̐ baigŏni mĕchchīni

(||nīvela||)
vāḍalu dirigi nīvu vachchina rāga sūsi
veḍugalu vĕdasallī vĕlam̐di
jāḍalado nī momu saṁdragaḽalu sūsi
vīḍĕbu noḍane vemārum̐ bŏgaḍīni

(||nīvela||)
vuduḍum̐ damagamuna vuṁḍe nīvunigi sūsi
kadisi navvulu navvīm̐ galigi
pŏdigina nī śhirasu puvvula daṁḍalu sūsi
yĕduḍa nilusuṁḍi seyĕtti mŏkkīni

(||nīvela||)
gakkuna vastā vachchi kām̐giḍam̐ gūḍam̐gām̐ jūsi
sĕkkulu nŏkkī ninnum̐ jĕliya
nikki śhrīveṁkaḍeśhum̐ḍa nī mannanalĕllām̐ jūsi
pakkana nīmīm̐daḍi padālu vāḍīni