Neevela ledanevu nee sadidonu

నీవేల లేదనేవు నీ సతితోను
Language

(॥పల్లవి॥)
నీవేల లేదనేవు నీ సతితోను
కావరించి పడుఁగాక కాదనకు మిఁకను

(॥నీవే॥)
మచ్చికలు చల్లుచు నీతో మాటలాడి నీకు నేఁడు
ఇచ్చకము నెరపదా ఇందాఁకను
అచ్చమైన ఆపెనేపో అన్నసుద్దులెల్లా నేను
ముచ్చటగా మరియేల మూసిదాఁచే విపుడు

(॥నీవె॥)
వీడెమిచ్చి నీతోను వేసాలు సేసుకొంటా
యీడ నిట్టే వుండదా యిందాఁకను
యేడనైనాఁ గాని యాపె నిన్నిటా నేఁ దిట్టితిఁబో
ఆడనిఁ వాదు లేఁటికి అణఁచేవు యిపుడు

(॥నీవె॥)
సరి నిన్నుఁ గాఁగిలించి సరసములాడుకొంటా
యిరవుకొని వుండదా ఇందాఁకను
అరిది శ్రీవేంకటేశ ఆపెనేపో కొసరితి
గరిమ మమ్మేల వొక్కటిసేసే విపుడు

(||pallavi||)
nīvela ledanevu nī sadidonu
kāvariṁchi paḍum̐gāga kādanagu mim̐kanu

(||nīve||)
machchigalu sallusu nīdo māḍalāḍi nīgu nem̐ḍu
ichchagamu nĕrabadā iṁdām̐kanu
achchamaina ābĕnebo annasuddulĕllā nenu
muchchaḍagā mariyela mūsidām̐se vibuḍu

(||nīvĕ||)
vīḍĕmichchi nīdonu vesālu sesugŏṁṭā
yīḍa niṭṭe vuṁḍadā yiṁdām̐kanu
yeḍanainām̐ gāni yābĕ ninniḍā nem̐ diṭṭidim̐bo
āḍanim̐ vādu lem̐ṭigi aṇam̐sevu yibuḍu

(||nīvĕ||)
sari ninnum̐ gām̐giliṁchi sarasamulāḍugŏṁṭā
yiravugŏni vuṁḍadā iṁdām̐kanu
aridi śhrīveṁkaḍeśha ābĕnebo kŏsaridi
garima mammela vŏkkaḍisese vibuḍu