Neevela komkevu ninnu ne vaddanenaa

నీవేల కొంకేవు నిన్ను నే వద్దనేనా
Language

(॥పల్లవి॥)
నీవేల కొంకేవు నిన్ను నే వద్దనేనా
భావించి నీ మేనెల్లా నా పాలిదే కాదా

(॥నీవే॥)
చెక్కులఁ జెమటగారఁ జెప్పీ సుద్దులు నీతో
అక్కరఁ జెలియమాట లాలించరాదా
ముక్కున నూర్పులు రేఁగ ముందరఁ బనులు చేసీ
చక్కఁగా నాపెను నీవు సంతోసించరాదా

(॥నీవే॥)
పాలిండ్లు గదలఁగాను పాదాలు నీకొత్తుతాను
తాలిమితో నవ్వీఁ జిత్తగించరాదా
వాలుకచూపులఁ గొచ్చి వాటముగా నిన్నుఁజూచి
చేలకొంగు వట్టి తీసిఁ జెనకఁగరాదా

(॥నీవే॥)
కప్పురము నోరికిచ్చి కాఁగిట నిన్నునించి
కప్పుకొనీఁ బడ్చడము కలయరాదా
యిప్పుడె శ్రీవేంకటేశ యీపె నిన్నుఁ బెండ్లాడె
వొప్పుగా నన్నేలితివి వొద్దనుండరాదా

(||pallavi||)
nīvela kŏṁkevu ninnu ne vaddanenā
bhāviṁchi nī menĕllā nā pālide kādā

(||nīve||)
sĕkkulam̐ jĕmaḍagāram̐ jĕppī suddulu nīdo
akkaram̐ jĕliyamāḍa lāliṁcharādā
mukkuna nūrbulu rem̐ga muṁdaram̐ banulu sesī
sakkam̐gā nābĕnu nīvu saṁtosiṁcharādā

(||nīve||)
pāliṁḍlu gadalam̐gānu pādālu nīgŏttudānu
tālimido navvīm̐ jittagiṁcharādā
vālugasūbulam̐ gŏchchi vāḍamugā ninnum̐jūsi
selagŏṁgu vaṭṭi tīsim̐ jĕnagam̐garādā

(||nīve||)
kappuramu norigichchi kām̐giḍa ninnuniṁchi
kappugŏnīm̐ baḍchaḍamu kalayarādā
yippuḍĕ śhrīveṁkaḍeśha yībĕ ninnum̐ bĕṁḍlāḍĕ
vŏppugā nannelidivi vŏddanuṁḍarādā