నీవేల కాఁతాళించి నెలఁతను తిట్టేవు
(॥పల్లవి॥)
నీవేల కాఁతాళించి నెలఁతను తిట్టేవు
వోవరిలో సిగ్గువడవొద్దా యీపెకును
(॥నీవే॥)
కొప్పుదువ్వుకొనఁగాను కోమలిఁ జూచి నీవు
చిప్పిలఁగ వెరగంది చెమరించేవు
గొప్పయైన పయ్యెదలో కుచములు గానరాఁగా
వొప్పుగా సిగ్గులు వడవొద్దా యీకెకును
(॥నీవే॥)
చీర గట్టుకొనఁగాను చెలియవద్దికి వచ్చి
వూరకే చొక్కుచు నిట్టూర్పు వుచ్చేవు
తోరమైన మెఱుఁగారుతొడలెల్లా గానరాఁగా
వోరుపుతో సిగ్గుపడవొద్దా యీపెకును
(॥నీవే॥)
పఱుపుపైఁ బండుండఁగా పక్క నీవూఁ బవళించి
అఱిముఱి రతిఁగూడి యలసేవు
మఱియు శ్రీవేంకటేశ మర్మములు గానరాఁగా
వొఱపుతో సిగ్గువడవొద్దా యీపెకును
(||pallavi||)
nīvela kām̐tāḽiṁchi nĕlam̐tanu tiṭṭevu
vovarilo sigguvaḍavŏddā yībĕgunu
(||nīve||)
kŏppuduvvugŏnam̐gānu komalim̐ jūsi nīvu
sippilam̐ga vĕragaṁdi sĕmariṁchevu
gŏppayaina payyĕdalo kusamulu gānarām̐gā
vŏppugā siggulu vaḍavŏddā yīgĕgunu
(||nīve||)
sīra gaṭṭugŏnam̐gānu sĕliyavaddigi vachchi
vūrage sŏkkusu niṭṭūrbu vuchchevu
toramaina mĕṟum̐gārudŏḍalĕllā gānarām̐gā
vorubudo siggubaḍavŏddā yībĕgunu
(||nīve||)
paṟububaim̐ baṁḍuṁḍam̐gā pakka nīvūm̐ bavaḽiṁchi
aṟimuṟi radim̐gūḍi yalasevu
maṟiyu śhrīveṁkaḍeśha marmamulu gānarām̐gā
vŏṟabudo sigguvaḍavŏddā yībĕgunu