నీవేల జంకించేవు నెలఁతల దిక్కు చూచి
(॥పల్లవి॥)
నీవేల జంకించేవు నెలఁతల దిక్కు చూచి
కావరించి సవతులు కాఁతాళించవలదా
(॥నీవే॥)
సంగడి నుండి నీతో సరస మాకె యాడఁగా
అంగనలు దూరి నిన్ను నాడకుందురా
సింగారాలు చూపి చూపి చలరేఁగుచుండఁగాను
కొంగువట్టి తీశాకెతో గుంపించకుందురా
(॥నీవే॥)
కొసరుచు నాకె నిన్ను కుచముల నొత్తఁగాను
కసరి ఇంతులు గొణఁగక వుందురా
మిసిమి దనసలిగె మెరయుచునుండఁగాను
పసగాఁ జేతులు చాఁచి పంతమాడ కుందురా
(॥నీవే॥)
కందువనుండి నిన్నాపె కైవసమై కూడఁగాను
అంది చెలులెల్లా సొలయకవుందురా
ఇందుకె శ్రీవేంకటేశ ఇంతులెల్లాఁగలసిరి
ముందరియాపెను ఇట్టె మోచి దించకుందురా
(||pallavi||)
nīvela jaṁkiṁchevu nĕlam̐tala dikku sūsi
kāvariṁchi savadulu kām̐tāḽiṁchavaladā
(||nīve||)
saṁgaḍi nuṁḍi nīdo sarasa māgĕ yāḍam̐gā
aṁganalu dūri ninnu nāḍaguṁdurā
siṁgārālu sūbi sūbi salarem̐gusuṁḍam̐gānu
kŏṁguvaṭṭi tīśhāgĕdo guṁpiṁchaguṁdurā
(||nīve||)
kŏsarusu nāgĕ ninnu kusamula nŏttam̐gānu
kasari iṁtulu gŏṇam̐gaga vuṁdurā
misimi danasaligĕ mĕrayusunuṁḍam̐gānu
pasagām̐ jedulu sām̐si paṁtamāḍa kuṁdurā
(||nīve||)
kaṁduvanuṁḍi ninnābĕ kaivasamai kūḍam̐gānu
aṁdi sĕlulĕllā sŏlayagavuṁdurā
iṁdugĕ śhrīveṁkaḍeśha iṁtulĕllām̐galasiri
muṁdariyābĕnu iṭṭĕ mosi diṁchaguṁdurā