నీవే యిన్నిటాఁగల నెరజాణవు
(॥పల్లవి॥)
నీవే యిన్నిటాఁగల నెరజాణవు
తావుల నీవన్నమాఁట తలఁచుకోవయ్యా
(॥నీవే॥)
బొమ్మలలో సరసము పూఁచినజంకెనలు
నెమ్మనపుసరసము నిండినగుట్టు
తమ్మిమోముసరసము తనివోనినగవులు
తెమ్మలుగాఁ జెలి యాడీ తెలుసుకోవయ్యా
(॥నీవే॥)
కొనగోరిసరసము గురియైన తాఁకులు
తనువుపై సరసము తడఁబాట్లు
చనుమొన సరసము సారెసారె కులుకులు
పనివడి యిందునే తెప్పలఁ దేలవయ్యా
(॥నీవే॥)
పెదవులసరసము ప్రియముల ముచ్చటలు
చదురైన రతిసరసము ముద్దులు
నిదుల శ్రీవేంకటేశ నీచెలిఁ గూడితివి
వదలక యిన్నియు నవధరించవయ్యా
(||pallavi||)
nīve yinniḍām̐gala nĕrajāṇavu
tāvula nīvannamām̐ṭa talam̐sugovayyā
(||nīve||)
bŏmmalalo sarasamu pūm̐sinajaṁkĕnalu
nĕmmanabusarasamu niṁḍinaguṭṭu
tammimomusarasamu tanivoninagavulu
tĕmmalugām̐ jĕli yāḍī tĕlusugovayyā
(||nīve||)
kŏnagorisarasamu guriyaina tām̐kulu
tanuvubai sarasamu taḍam̐bāṭlu
sanumŏna sarasamu sārĕsārĕ kulugulu
panivaḍi yiṁdune tĕppalam̐ delavayyā
(||nīve||)
pĕdavulasarasamu priyamula muchchaḍalu
saduraina radisarasamu muddulu
nidula śhrīveṁkaḍeśha nīsĕlim̐ gūḍidivi
vadalaga yinniyu navadhariṁchavayyā