Neeve yerumguduvu ni nnaadamdu piluvamga

నీవే యెరుఁగుదువు ని న్నాతఁడు పిలువఁగ
Language

(॥పల్లవి॥)
నీవే యెరుఁగుదువు ని న్నాతఁడు పిలువఁగ
వావాత నూఁకొనవు వద్దు చల మమ్మా

(॥నీవే॥)
ముక్కున నూర్పులు రేఁగ ముంజేయి వట్టి పెనఁగీ
వెక్కసపు సంతంటివాఁడు యింత నిన్ను వేఁడుకోఁగ
యెక్కువ నంతటివాఁడు యింత నిన్ను వేఁడుకోఁగ
చిక్క కిట్టె బిగిసేవు చెల్లునా వో యమ్మా

(॥నీవే॥)
పూవుల కొప్పెల్ల జార పుడిసిట నిన్ను నెత్తె
వోవల పతికి లో నై వుండవే కొంతా
వేవేలు కాంతలవాఁడు వెస నిన్ను బొదుగఁగ
నీ వెం తైనా గుట్టియ్యవు నీకుఁ దగ దమ్మా

(॥నీవే॥)
తా నాతఁడు నీకు లోనై తమకానఁ గూడఁగాను
ఆన లెల్లఁ బెట్ట వచ్చే వ దేమే యింకా
పూని శ్రీవెంకటపతి భోగించే నిన్ను రతి
కానిమ్మని పాయకువే కలకాల మమ్మా

(||pallavi||)
nīve yĕrum̐guduvu ni nnādam̐ḍu piluvam̐ga
vāvāda nūm̐kŏnavu vaddu sala mammā

(||nīve||)
mukkuna nūrbulu rem̐ga muṁjeyi vaṭṭi pĕnam̐gī
vĕkkasabu saṁtaṁṭivām̐ḍu yiṁta ninnu vem̐ḍugom̐ga
yĕkkuva naṁtaḍivām̐ḍu yiṁta ninnu vem̐ḍugom̐ga
sikka kiṭṭĕ bigisevu sĕllunā vo yammā

(||nīve||)
pūvula kŏppĕlla jāra puḍisiḍa ninnu nĕttĕ
vovala padigi lo nai vuṁḍave kŏṁtā
vevelu kāṁtalavām̐ḍu vĕsa ninnu bŏdugam̐ga
nī vĕṁ tainā guṭṭiyyavu nīgum̐ daga dammā

(||nīve||)
tā nādam̐ḍu nīgu lonai tamagānam̐ gūḍam̐gānu
āna lĕllam̐ bĕṭṭa vachche va deme yiṁkā
pūni śhrīvĕṁkaḍabadi bhogiṁche ninnu radi
kānimmani pāyaguve kalagāla mammā