Neeve yeṟumguduvu neevu sesina mahima

నీవే యెఱుఁగుదువు నీవు సేసిన మహిమ
Language

(॥పల్లవి॥)
నీవే యెఱుఁగుదువు నీవు సేసిన మహిమ
కైవశమాయఁ బనులు కల్లలేదు యిందును

(॥నీవే॥)
తలఁపు నీభోగములే తలపించీఁగాని నీతో
చలము సాదించేనంటే సాగనియ్యదు
వలపు లంతంతకు వడ్డివారీఁగాని మరి
పలుకకవుండేనంటే పట్టరా దెంతైనా

(॥నీవే॥)
చూపులు నీరూపము చూడనే కోరీఁగాని
కోపగించుకోనేనంటే కొలుపనీదు
తీపుల జవ్వన మిది తేనెలే మించీఁగాని
వోపనన్నాఁ దమకము వుడివోవనీయదు

(॥నీవే॥)
కాయమిది నీకాఁగిటికందువఁ బొదలీఁగాని
చాయ సేసుకొనేనంటే సమ్మతించదు
యీయెడ శ్రీవేంకటేశ ఇంత సేసి పొందితివి
ఆయము లంటేనంటే అడ్డమయ్యీఁ గరుణ

(||pallavi||)
nīve yĕṟum̐guduvu nīvu sesina mahima
kaivaśhamāyam̐ banulu kallaledu yiṁdunu

(||nīve||)
talam̐pu nībhogamule talabiṁchīm̐gāni nīdo
salamu sādiṁchenaṁṭe sāganiyyadu
valabu laṁtaṁtagu vaḍḍivārīm̐gāni mari
palugagavuṁḍenaṁṭe paṭṭarā dĕṁtainā

(||nīve||)
sūbulu nīrūbamu sūḍane korīm̐gāni
kobagiṁchugonenaṁṭe kŏlubanīdu
tībula javvana midi tenĕle miṁchīm̐gāni
vobanannām̐ damagamu vuḍivovanīyadu

(||nīve||)
kāyamidi nīgām̐giḍigaṁduvam̐ bŏdalīm̐gāni
sāya sesugŏnenaṁṭe sammadiṁchadu
yīyĕḍa śhrīveṁkaḍeśha iṁta sesi pŏṁdidivi
āyamu laṁṭenaṁṭe aḍḍamayyīm̐ garuṇa