నీవే యెరుఁగుదువు నీ గుణము కొలఁదులు
(॥పల్లవి॥)
నీవే యెరుఁగుదువు నీ గుణము కొలఁదులు
చేవదేర నెందరినిఁ జేసితివో యిట్లా
(॥నీవే॥)
కప్పురపు మాటలనే కరఁగించి యిందాఁకానీ-
నొప్పి దీరిచితివౌరా నొడలఁ బెట్టి
రెప్పలచూపుల రేసు రేఁచి యేఁచే నంటా వుంటి
యిప్పుడేమీ ననఁజాల యేఁటిదో నీమాయ
(॥నీవే॥)
ఆసలచూపులు చూచి అట్టె నన్ను బ్రమయించి
సేసిన నీచేఁతలెల్లాఁ జెల్లించు కొంటి
యీసుల నిందాఁక నుంటి యింతలోనే నిన్నుఁగని
మూసినముత్యమనైతి ముందరేదో కానీ
(॥నీవే॥)
కనుమాయ రతి సేసి కాఁగిటనె నన్నుఁ గూడి
మొనసి నీమేలు నాపై మూఁట గట్టితి
ఘనుఁడ శ్రీవేంకటేశ కడుఁదమకించి వుంటి
తనిసితి నన్నిటాను దట్టమాయ వలపు
(||pallavi||)
nīve yĕrum̐guduvu nī guṇamu kŏlam̐dulu
sevadera nĕṁdarinim̐ jesidivo yiṭlā
(||nīve||)
kappurabu māḍalane karam̐giṁchi yiṁdām̐kānī-
nŏppi dīrisidivaurā nŏḍalam̐ bĕṭṭi
rĕppalasūbula resu rem̐si yem̐se naṁṭā vuṁṭi
yippuḍemī nanam̐jāla yem̐ṭido nīmāya
(||nīve||)
āsalasūbulu sūsi aṭṭĕ nannu bramayiṁchi
sesina nīsem̐talĕllām̐ jĕlliṁchu kŏṁṭi
yīsula niṁdām̐ka nuṁṭi yiṁtalone ninnum̐gani
mūsinamutyamanaidi muṁdaredo kānī
(||nīve||)
kanumāya radi sesi kām̐giḍanĕ nannum̐ gūḍi
mŏnasi nīmelu nābai mūm̐ṭa gaṭṭidi
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kaḍum̐damagiṁchi vuṁṭi
tanisidi nanniḍānu daṭṭamāya valabu