Neeve yeṟumguduvu ne vichchi seppanela

నీవే యెఱుఁగుదువు నే విచ్చి చెప్పనేల
Language

(॥పల్లవి॥)
నీవే యెఱుఁగుదువు నే విచ్చి చెప్పనేల
కైవశమైనందుకెల్లా కడమలు లేవు

(॥నీవే॥)
వింతలైనసుద్దులెల్లా విన్నపాలు సేసితిని
మంతుకెక్క మఱవకు మతిలో నను
చింతదీర నీకు నే చేతులెత్తి మొక్కితిని
అంతటాను దయవెట్టు మందుకే నామీఁదను

(॥నీవే॥)
కందువలు చూపిచూపి కానుకలు నీకిచ్చితి
అందముగ వదలకు హస్తము నను
సందడిలో నిన్ను నిట్టె సన్నల నే వేఁడుకొంటి
పొందికతో నీయిచ్చల భోగించు నన్నును

(॥నీవే॥)
సారె సారెఁ గాఁగిలించి సరసములాడితిని
కోరికలింకా నానతీ గుఱతుగాను
యీరీతి శ్రీ వేంకటేశ యిట్టె నిన్నిటు గూడితి
గారవించి రక్షించుమీ ఘనుఁడవు నన్నును

(||pallavi||)
nīve yĕṟum̐guduvu ne vichchi sĕppanela
kaivaśhamainaṁdugĕllā kaḍamalu levu

(||nīve||)
viṁtalainasuddulĕllā vinnabālu sesidini
maṁtugĕkka maṟavagu madilo nanu
siṁtadīra nīgu ne sedulĕtti mŏkkidini
aṁtaḍānu dayavĕṭṭu maṁduge nāmīm̐danu

(||nīve||)
kaṁduvalu sūbisūbi kānugalu nīgichchidi
aṁdamuga vadalagu hastamu nanu
saṁdaḍilo ninnu niṭṭĕ sannala ne vem̐ḍugŏṁṭi
pŏṁdigado nīyichchala bhogiṁchu nannunu

(||nīve||)
sārĕ sārĕm̐ gām̐giliṁchi sarasamulāḍidini
korigaliṁkā nānadī guṟadugānu
yīrīdi śhrī veṁkaḍeśha yiṭṭĕ ninniḍu gūḍidi
gāraviṁchi rakṣhiṁchumī ghanum̐ḍavu nannunu