Neeve yerumguduvu naaneyyamu vo ramani

నీవే యెరుఁగుదువు నానెయ్యము వో రమణి
Language

(॥పల్లవి॥)
నీవే యెరుఁగుదువు నానెయ్యము వో రమణి
భావము లోపలనుండి భ్రమయించ నేఁటికి

(॥॥)
చూపుటమ్ము బొమ్మవింట జోడై నిలిచెఁగాన
చేపట్టి మర్మ వేదనఁ జేయుఁగాక
కోపులమంచితనపుఁగుచమండలము నేఁడు
యేపున భ్రాణాలతోడ యేలాట మెట్లాడీనే

(॥॥)
తొడఁగి మబ్బుగవిసి దొడ్డకుటిలపుఁగొప్పు
కడుఁగామాంధకారముఁ గప్పుఁగాక
నడుమ మోముఁజందుడ్రు నవ్వువెన్నెల గాయుచు
చిడుముడి నామదినిఁ జీఁక టేల సేసీనే

(॥॥)
పచ్చిదొండపండు వంటిబాగుల రాగపు మోవి
రిచ్చవడ మోహము రేఁచుఁగాక
ఇచ్చకపు శ్రీ వేంకటేశుఁడ రమ్మని నన్ను
ఇచ్చఁగూడితివి రతి నిందాఁకా నెట్లుండెనే

(||pallavi||)
nīve yĕrum̐guduvu nānĕyyamu vo ramaṇi
bhāvamu lobalanuṁḍi bhramayiṁcha nem̐ṭigi

(||||)
sūbuḍammu bŏmmaviṁṭa joḍai nilisĕm̐gāna
sebaṭṭi marma vedanam̐ jeyum̐gāga
kobulamaṁchidanabum̐gusamaṁḍalamu nem̐ḍu
yebuna bhrāṇāladoḍa yelāḍa mĕṭlāḍīne

(||||)
tŏḍam̐gi mabbugavisi dŏḍḍaguḍilabum̐gŏppu
kaḍum̐gāmāṁdhagāramum̐ gappum̐gāga
naḍuma momum̐jaṁduḍru navvuvĕnnĕla gāyusu
siḍumuḍi nāmadinim̐ jīm̐ka ṭela sesīne

(||||)
pachchidŏṁḍabaṁḍu vaṁṭibāgula rāgabu movi
richchavaḍa mohamu rem̐sum̐gāga
ichchagabu śhrī veṁkaḍeśhum̐ḍa rammani nannu
ichcham̐gūḍidivi radi niṁdām̐kā nĕṭluṁḍĕne