నీవే యెఱుఁగుదువయ్యా నే నేమీ నెఱుఁగను
(॥పల్లవి॥)
నీవే యెఱుఁగుదువయ్యా నే నేమీ నెఱుఁగను
చేవదేరి యేమి మేలు సేయఁ గోరినాఁడవో
(॥నీవే॥)
చెక్కిటిచేతితోడ చెఱఁగు మాసియుండఁగా
మొక్కలానఁ బైకొని ముట్టఁ జూచేవు
దిక్కుల నీలో నింత తెగువ గలవాఁడవు
యెక్కడ నెవ్వతెవొద్ద నేమి సేసితివో
(॥నీవే॥)
మంతనాన యింటిలోన మఱచి నే నుండఁగాన
చెంత నావొద్ది బాగాలు చేతఁ దీసేవు
యింతేసి పనులకు నేవగించనివాఁడవు
వింతవారివొద్ద నెంత వెరవు మాలితివో
(॥నీవే॥)
సిగ్గుతో నెపా లూరకే సేసుకని నే నుండఁగా
దగ్గరి న న్నిట్టే కూడి తమకించేవు
యెగ్గనక శ్రీవేంకటేశ యింతటివాఁడవు
వెగ్గళించి యెందెందు వెల్లివిరి యైతివో
(||pallavi||)
nīve yĕṟum̐guduvayyā ne nemī nĕṟum̐ganu
sevaderi yemi melu seyam̐ gorinām̐ḍavo
(||nīve||)
sĕkkiḍisedidoḍa sĕṟam̐gu māsiyuṁḍam̐gā
mŏkkalānam̐ baigŏni muṭṭam̐ jūsevu
dikkula nīlo niṁta tĕguva galavām̐ḍavu
yĕkkaḍa nĕvvadĕvŏdda nemi sesidivo
(||nīve||)
maṁtanāna yiṁṭilona maṟasi ne nuṁḍam̐gāna
sĕṁta nāvŏddi bāgālu sedam̐ dīsevu
yiṁtesi panulagu nevagiṁchanivām̐ḍavu
viṁtavārivŏdda nĕṁta vĕravu mālidivo
(||nīve||)
siggudo nĕbā lūrage sesugani ne nuṁḍam̐gā
daggari na nniṭṭe kūḍi tamagiṁchevu
yĕgganaga śhrīveṁkaḍeśha yiṁtaḍivām̐ḍavu
vĕggaḽiṁchi yĕṁdĕṁdu vĕlliviri yaidivo