Neeve yerumgudu vimte nee sittamu

నీవే యెరుఁగుదు వింతే నీ చిత్తము
Language

(॥పల్లవి॥)
నీవే యెరుఁగుదు వింతే నీ చిత్తము
యీవేళ నే నోరిచితి యింకా నీ చిత్తము

(॥నీవే॥)
చెంతల నవ్వ వచ్చేవు చెయి వట్టి పెనఁగేవు
అంతటి కోపితేఁ జాలు నైతే నీచిత్తము
యింతటిదొర వంటాను యేమి ననఁ జాలు నింతె
యెంత కెంత వెరచెనా యింకా నీ చిత్తము

(॥నీవే॥)
కప్పురము చల్లేవు కాలు మీఁద వేసేవు
అప్పటి పంతా లాడే వైతే నీచిత్తము
యిప్పుడే నీకు మొక్కితి నిందరును జూడగాను
యెప్పుడు నన్నెరఁగవా యింకా నీచిత్తము

(॥నీవే॥)
బెట్టి కాఁగిలించేవు పిప్పి సేసేవు నామోవి
అట్టె కానీ లేర అయితే నీ చిత్తము
నెట్టన శ్రీవెంకటేశ నేఁడె నన్నుఁ గూడితివి
యిట్టైతేనేఁ గా దనేనా యింకా నీ చిత్తము

(||pallavi||)
nīve yĕrum̐gudu viṁte nī sittamu
yīveḽa ne norisidi yiṁkā nī sittamu

(||nīve||)
sĕṁtala navva vachchevu sĕyi vaṭṭi pĕnam̐gevu
aṁtaḍi kobidem̐ jālu naide nīsittamu
yiṁtaḍidŏra vaṁṭānu yemi nanam̐ jālu niṁtĕ
yĕṁta kĕṁta vĕrasĕnā yiṁkā nī sittamu

(||nīve||)
kappuramu sallevu kālu mīm̐da vesevu
appaḍi paṁtā lāḍe vaide nīsittamu
yippuḍe nīgu mŏkkidi niṁdarunu jūḍagānu
yĕppuḍu nannĕram̐gavā yiṁkā nīsittamu

(||nīve||)
bĕṭṭi kām̐giliṁchevu pippi sesevu nāmovi
aṭṭĕ kānī lera ayide nī sittamu
nĕṭṭana śhrīvĕṁkaḍeśha nem̐ḍĕ nannum̐ gūḍidivi
yiṭṭaidenem̐ gā danenā yiṁkā nī sittamu