Neeve yeṟimgi mannimchu neesittamu

నీవే యెఱిఁగి మన్నించు నీచిత్తము
Language

(॥పల్లవి॥)
నీవే యెఱిఁగి మన్నించు నీచిత్తము
కావరించి నిన్ను నంత గాసిఁబెట్టను

(॥నీవే॥)
కొసరఁగఁ దగుదువు కొంగువట్టఁ దగుదువు
విసిగేవోయని నిన్ను వేసరించను
రసికుఁడ విన్నిటాను రాజసము చెల్లు నీకు
వసమైనదాఁకా నీతో వాసు లెంచను

(॥నీవే॥)
పచ్చి సేయఁ దగుదువు పంతమాడఁ దగుదువు
రచ్చకెక్కేవని నిన్ను రాయడించను
వచ్చినట్టే వత్తువు వలపు గలదు నీకు
మెచ్చినదాఁకా నీతో మేలమాడను

(॥నీవే॥)
నవ్వు నవ్వఁదగుదువు నాలిసేయఁ దగుదువు
జవ్వనపు వాఁడవని సాదించను
యివ్వల శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁగూడితివి
చివ్వన నిందాఁకా నిన్నుఁ జెక్కునొక్కను

(||pallavi||)
nīve yĕṟim̐gi manniṁchu nīsittamu
kāvariṁchi ninnu naṁta gāsim̐bĕṭṭanu

(||nīve||)
kŏsaram̐gam̐ daguduvu kŏṁguvaṭṭam̐ daguduvu
visigevoyani ninnu vesariṁchanu
rasigum̐ḍa vinniḍānu rājasamu sĕllu nīgu
vasamainadām̐kā nīdo vāsu lĕṁchanu

(||nīve||)
pachchi seyam̐ daguduvu paṁtamāḍam̐ daguduvu
rachchagĕkkevani ninnu rāyaḍiṁchanu
vachchinaṭṭe vattuvu valabu galadu nīgu
mĕchchinadām̐kā nīdo melamāḍanu

(||nīve||)
navvu navvam̐daguduvu nāliseyam̐ daguduvu
javvanabu vām̐ḍavani sādiṁchanu
yivvala śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐gūḍidivi
sivvana niṁdām̐kā ninnum̐ jĕkkunŏkkanu