నీవే యెరిఁగే వన్నియు నేనాడఁగ నేల
(॥పల్లవి॥)
నీవే యెరిఁగే వన్నియు నేనాడఁగ నేల
కామిం(విం?)చి యిప్పటనుండి కతలేలా
(॥నీవే॥)
మొదల నీయింటిలోన మూలనుండితేఁ జాలు
పదిమారులును నీతోఁ బంతమేల
పెదవు లెత్తక నాలో బింకాన నుంటేఁ జాలు
వదలక యెడలేనివాదు లేల
(॥నీవే॥)
పయ్యద గప్పుక వొద్దఁ బవ్వళించి వుంటేఁ జాలు
చయ్యన మాకంత నిన్ను సాదించనేల
సెయ్యానఁ దలవంచుక నిక్కి చూడకున్నఁజాలు
అయ్యో నిన్ను మట్టు పెట్ట నంతయేల
(॥నీవే॥)
వేమరు నిన్ను నేను వేఁడుకోకుంటేఁ జాలు
చేముట్టి నీకిట్టె బుద్ది చెప్పనేల
యీమేర శ్రీవేంకటేశ యిదె నన్నుఁ గూడితివి
నామనసు వచ్చె నీతో నవ్వనేల
(||pallavi||)
nīve yĕrim̐ge vanniyu nenāḍam̐ga nela
kāmiṁ(viṁ?)si yippaḍanuṁḍi kadalelā
(||nīve||)
mŏdala nīyiṁṭilona mūlanuṁḍidem̐ jālu
padimārulunu nīdom̐ baṁtamela
pĕdavu lĕttaga nālo biṁkāna nuṁṭem̐ jālu
vadalaga yĕḍalenivādu lela
(||nīve||)
payyada gappuga vŏddam̐ bavvaḽiṁchi vuṁṭem̐ jālu
sayyana māgaṁta ninnu sādiṁchanela
sĕyyānam̐ dalavaṁchuga nikki sūḍagunnam̐jālu
ayyo ninnu maṭṭu pĕṭṭa naṁtayela
(||nīve||)
vemaru ninnu nenu vem̐ḍugoguṁṭem̐ jālu
semuṭṭi nīgiṭṭĕ buddi sĕppanela
yīmera śhrīveṁkaḍeśha yidĕ nannum̐ gūḍidivi
nāmanasu vachchĕ nīdo navvanela