(॥పల్లవి॥)
నీవే యెరఁగవలె నెరజాణవు
వేవేలు నీకు విన్నవించే వారెవ్వరయ్యా
(॥నీవే॥)
నిరతి నిన్నటనుండి నీవీకెతో నుండఁగాను
వరుసకు వచ్చి యాపె వాకిటనుండీ
తరితీపు సేసేవు తరుణులిద్దరి సంది
వెరవుతో నీకు విన్నవించే వారెవ్వరయ్యా
(॥నీవే॥)
పూని నీవీకెతోను భోగించుకుండఁగాను
కానుక దెచ్చుక యాపె గాచుకున్నది
తానకమై ఇద్దరికి తమకములు రేఁచేవు
వీనులంట నీకు విన్నవించే వారెవ్వరయ్యా
(॥నీవే॥)
శ్రీ వేంకటేశ నీవీకెఁ జేరి కూడుండఁగాను
సేవ సేసేనంటా నాపె చెంతనున్నది
ఆవరుసల నిద్దరి నందముగా నేలితివి
వేవేగ నీకు విన్నవించే వారెవరయ్యా
(||pallavi||)
nīve yĕram̐gavalĕ nĕrajāṇavu
vevelu nīgu vinnaviṁche vārĕvvarayyā
(||nīve||)
niradi ninnaḍanuṁḍi nīvīgĕdo nuṁḍam̐gānu
varusagu vachchi yābĕ vāgiḍanuṁḍī
taridību sesevu taruṇuliddari saṁdi
vĕravudo nīgu vinnaviṁche vārĕvvarayyā
(||nīve||)
pūni nīvīgĕdonu bhogiṁchuguṁḍam̐gānu
kānuga dĕchchuga yābĕ gāsugunnadi
tānagamai iddarigi tamagamulu rem̐sevu
vīnulaṁṭa nīgu vinnaviṁche vārĕvvarayyā
(||nīve||)
śhrī veṁkaḍeśha nīvīgĕm̐ jeri kūḍuṁḍam̐gānu
seva sesenaṁṭā nābĕ sĕṁtanunnadi
āvarusala niddari naṁdamugā nelidivi
vevega nīgu vinnaviṁche vārĕvarayyā