నీవే యానతీవయ్య నేమేమీ నెఱఁగము
(॥పల్లవి॥)
నీవే యానతీవయ్య నేమేమీ నెఱఁగము
కావిరి నీ మొకములోఁ గళలే కంటిమి
(॥॥)
చిక్కువడ్డ మనసులో చింత యెవ్వఁడెరుఁగును
చిక్కునఁబెట్టిన నీచేయిఁ గంటిమి
చక్కఁగా నప్పటి నీసంతోస మెవ్వఁడెఱుఁగు
వుక్కుమీరే సెలవి నవ్వులే కంటిమి
(॥॥)
తడఁబడ్డ నీరతి తమక మెవ్వఁడెఱుఁగు
అదరి నీవచ్చిన రాకదే కంటిమి
పెడరేఁటి నీవుచెప్పే ప్రియము లెవ్వఁడెఱుఁగు
విడువక నీవు చేయివేసినదే కంటిమి
(॥॥)
అచ్చమైన నీలోని యానంద మెవ్వఁడెఱుఁగు
ముచ్చటలాడే సరసములే కంటిమి
విచ్చనవిడిని శ్రీవేంకటేశ కూడితివి
తచ్చన లెవ్వఁడెఱుగు దక్కినదే కంటిమి
(||pallavi||)
nīve yānadīvayya nememī nĕṟam̐gamu
kāviri nī mŏgamulom̐ gaḽale kaṁṭimi
(||||)
sikkuvaḍḍa manasulo siṁta yĕvvam̐ḍĕrum̐gunu
sikkunam̐bĕṭṭina nīseyim̐ gaṁṭimi
sakkam̐gā nappaḍi nīsaṁtosa mĕvvam̐ḍĕṟum̐gu
vukkumīre sĕlavi navvule kaṁṭimi
(||||)
taḍam̐baḍḍa nīradi tamaga mĕvvam̐ḍĕṟum̐gu
adari nīvachchina rāgade kaṁṭimi
pĕḍarem̐ṭi nīvusĕppe priyamu lĕvvam̐ḍĕṟum̐gu
viḍuvaga nīvu seyivesinade kaṁṭimi
(||||)
achchamaina nīloni yānaṁda mĕvvam̐ḍĕṟum̐gu
muchchaḍalāḍe sarasamule kaṁṭimi
vichchanaviḍini śhrīveṁkaḍeśha kūḍidivi
tachchana lĕvvam̐ḍĕṟugu dakkinade kaṁṭimi