నీవే యానతీరాదా వీనుల నే వినేఁగాని
(॥పల్లవి॥)
నీవే యానతీరాదా వీనుల నే వినేఁగాని
మావంటివారికి మాటయేదయ్యా
(॥నీవే॥)
కన్నులఁ దిట్టితే నీపై కాఁతాళ మందువు
చన్నుల నొత్తితే నీతో చలమందువు
యెన్ని చూచితే నీపొందు యెందుకైనా వచ్చునిఁక
కన్నెలైన వారికెల్లా గతి యేదయ్యా
(॥నీవే॥)
వచ్చీరాకవుండితే వాసికత్తె యందువు
చొచ్చిమాటాడితేనే యాసోదమందువు
రచ్చలవేసితే నీకత రంటికిని గురియౌను
మచ్చిక నీలేమలకు మనువేది యిఁకను
(॥నీవే॥)
నెమ్మది నూరకుండితే నేర దిది యందువు
కమ్మరఁ గొంగువట్టితే గయ్యాళందువు
ఇమ్ముల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
సమ్మ తించెచెలులకు చనవేది యిఁకను
(||pallavi||)
nīve yānadīrādā vīnula ne vinem̐gāni
māvaṁṭivārigi māḍayedayyā
(||nīve||)
kannulam̐ diṭṭide nībai kām̐tāḽa maṁduvu
sannula nŏttide nīdo salamaṁduvu
yĕnni sūside nībŏṁdu yĕṁdugainā vachchunim̐ka
kannĕlaina vārigĕllā gadi yedayyā
(||nīve||)
vachchīrāgavuṁḍide vāsigattĕ yaṁduvu
sŏchchimāḍāḍidene yāsodamaṁduvu
rachchalaveside nīgada raṁṭigini guriyaunu
machchiga nīlemalagu manuvedi yim̐kanu
(||nīve||)
nĕmmadi nūraguṁḍide nera didi yaṁduvu
kammaram̐ gŏṁguvaṭṭide gayyāḽaṁduvu
immula śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
samma tiṁchĕsĕlulagu sanavedi yim̐kanu