Neeve yaadamdu gaavaa neramedadi

నీవే యాతఁడు గావా నేరమేడది
Language

(॥పల్లవి॥)
నీవే యాతఁడు గావా నేరమేడది
కావిరి వెరగులేల కాఁగిటిలోను

(॥నీవే॥)
చెలువుఁడు మాటాడఁగాఁ జెవి యొగ్గి వినరాదా
చలపాదితనమేల సముకానను
సెలవులఁజింది నవ్వు చేతలనే పట్టరాదా
పెలుచు వొడ్డారాలేల ప్రియముల లోనను

(॥నీవే॥)
ఇంత వొడఁబరచఁగ నియ్యకొని కూడరాదా
పంతము లింతేసి యేల పానుపుమీఁద
దొంతిఁబెట్టి మోవిపండు తొలఁగ కందుకోరాదా
సంతజాణతనాలేల సరసములోనను

(॥నీవే॥)
గుట్టుతోడఁ గలయఁగ గుణము మెచ్చఁగరాదా
ఱట్టిడితనమేల మఱఁగైనవేళ
ముట్టీ శ్రీవేంకటేశుఁడు మొగిఁ జన్నులొగ్గరాదా
గుట్టు చూప నిఁకనేల కూరిములలోనను

(||pallavi||)
nīve yādam̐ḍu gāvā nerameḍadi
kāviri vĕragulela kām̐giḍilonu

(||nīve||)
sĕluvum̐ḍu māḍāḍam̐gām̐ jĕvi yŏggi vinarādā
salabādidanamela samugānanu
sĕlavulam̐jiṁdi navvu sedalane paṭṭarādā
pĕlusu vŏḍḍārālela priyamula lonanu

(||nīve||)
iṁta vŏḍam̐barasam̐ga niyyagŏni kūḍarādā
paṁtamu liṁtesi yela pānubumīm̐da
dŏṁtim̐bĕṭṭi movibaṁḍu tŏlam̐ga kaṁdugorādā
saṁtajāṇadanālela sarasamulonanu

(||nīve||)
guṭṭudoḍam̐ galayam̐ga guṇamu mĕchcham̐garādā
ṟaṭṭiḍidanamela maṟam̐gainaveḽa
muṭṭī śhrīveṁkaḍeśhum̐ḍu mŏgim̐ jannulŏggarādā
guṭṭu sūba nim̐kanela kūrimulalonanu