Neeve vemdugonavayya neevu sesinasemtagu

నీవే వేఁడుకొనవయ్య నీవు సేసినసేఁతకు
Language

(॥పల్లవి॥)
నీవే వేఁడుకొనవయ్య నీవు సేసినసేఁతకు
మావంటివారి చేతి మాటలేఁటివయ్యా

(॥నీవే॥)
సిగ్గులు దేరీనో చింతఁ బొరలీనో
దగ్గరి యుండియునింతి తల యెత్తదు
అగ్గలమై నేమేమన్న అట్టే కసరుకొనీ
యెగ్గు నీవేమి సేసితో యెఱఁగమయ్యా

(॥నీవే॥)
చనవు నెరసీనో చలము సాదించీనో
ననిచి నీతోఁ గొంత నవ్వు నవ్వదు
కనుఁగొని మాకు మాకే కానుకిచ్చిననొల్లదు
కొనమాట నీవె యెఱఁగుదువయ్యా

(॥నీవే॥)
కోపము మతినున్నదో గుట్టుసేసుకున్నదో
పై పై నివ్వెరగుల బ్రమశున్నది
యేపున శ్రీవేంకటేశ యింతలోనే కూడితివి
తీపుల యీవెడమాయ తెలియదయ్యా

(||pallavi||)
nīve vem̐ḍugŏnavayya nīvu sesinasem̐tagu
māvaṁṭivāri sedi māḍalem̐ṭivayyā

(||nīve||)
siggulu derīno siṁtam̐ bŏralīno
daggari yuṁḍiyuniṁti tala yĕttadu
aggalamai nememanna aṭṭe kasarugŏnī
yĕggu nīvemi sesido yĕṟam̐gamayyā

(||nīve||)
sanavu nĕrasīno salamu sādiṁchīno
nanisi nīdom̐ gŏṁta navvu navvadu
kanum̐gŏni māgu māge kānugichchinanŏlladu
kŏnamāḍa nīvĕ yĕṟam̐guduvayyā

(||nīve||)
kobamu madinunnado guṭṭusesugunnado
pai pai nivvĕragula bramaśhunnadi
yebuna śhrīveṁkaḍeśha yiṁtalone kūḍidivi
tībula yīvĕḍamāya tĕliyadayyā