Neeve vachchi pratyakshamai niluduvu gaaga maagu

నీవే వచ్చి ప్రత్యక్షమై నిలుతువు గాక మాకు
Language

(॥పల్లవి॥)
నీవే వచ్చి ప్రత్యక్షమై నిలుతువు గాక మాకు
భావించి నిన్ను రూపించి పట్ట నెట్టు వచ్చును

(॥నీవే॥)
పాలజలనిధిలోన పండేది నీ కొకచోటు
వోలి జీవులలో నెల్లా వుండేది నీ కొకచోటు
తేలగిల సూర్యునిలో తిమ్మట నీ కొకచోటు
తాలిమి ని న్నెందని వెదకఁ గల మిఁకను

(॥నీవే॥)
అనలునిలోపల నారగించే దొకచేటు
గొనకొని వైకుంఠానఁ గొలువుండేదొక చోటు
పొనుఁగక దాసులిండ్లఁ బూజఁగొనే దొకచోటు
ఘనుఁడ నిన్ను సోదించి కన నెట్టు వచ్చును

(॥నీవే॥)
రతిఁ దులసివనాన రచ్చ సేసే దొకచోటు
కతలుగా లక్ష్మితోడ కాఁపురము లొకచోటు
తతి శ్రీవేంకటాద్రిపై దగఁ గాణాచొకచోటు
యితవుగా నీ చొప్పు లెత్తఁగ మాతరమా

(||pallavi||)
nīve vachchi pratyakṣhamai niluduvu gāga māgu
bhāviṁchi ninnu rūbiṁchi paṭṭa nĕṭṭu vachchunu

(||nīve||)
pālajalanidhilona paṁḍedi nī kŏgasoḍu
voli jīvulalo nĕllā vuṁḍedi nī kŏgasoḍu
telagila sūryunilo timmaḍa nī kŏgasoḍu
tālimi ni nnĕṁdani vĕdagam̐ gala mim̐kanu

(||nīve||)
analunilobala nāragiṁche dŏgaseḍu
gŏnagŏni vaiguṁṭhānam̐ gŏluvuṁḍedŏga soḍu
pŏnum̐gaga dāsuliṁḍlam̐ būjam̐gŏne dŏgasoḍu
ghanum̐ḍa ninnu sodiṁchi kana nĕṭṭu vachchunu

(||nīve||)
radim̐ dulasivanāna rachcha sese dŏgasoḍu
kadalugā lakṣhmidoḍa kām̐puramu lŏgasoḍu
tadi śhrīveṁkaḍādribai dagam̐ gāṇāsŏgasoḍu
yidavugā nī sŏppu lĕttam̐ga mādaramā