నీవే తెలుసుకొమ్మీ నీ వోపిక
(॥పల్లవి॥)
నీవే తెలుసుకొమ్మీ నీ వోపిక
యీవల నేఁ గాదనేనా యింత కోపఁగలవా
(॥నీవే॥)
చిగురాకు గెమ్మావి చెంచువారము నీకు
వొగరై తోఁటునేమె వొద్దురా నేము
సొగుసులేళ్లవంటిచూపులు మావి పెక్కు
వగలై మిన్నులఁ బారీ వంచుకొనఁగలవా
(॥నీవే॥)
సరవి కొండలవంటి చన్నులనేము నీ-
వురమెల్ల నొత్తుఁజేసు నొద్దురా నేము
కరికుంభములవంటి కటితటము యీ-
అరిది నడవివారి నాపఁ గలవా
(॥నీవే॥)
చిల్లెరతీగెలవంటి చేతులు మావి నీ-
వొళ్లెల్ల నరడుఁజేసు వొద్దురా నేము
మెల్లనే శ్రీ వేంకటేశ మేకొలిపి కూడితివి
బల్లిదుఁడ వౌదుగాక పంతమాడఁగలవా
(||pallavi||)
nīve tĕlusugŏmmī nī vobiga
yīvala nem̐ gādanenā yiṁta kobam̐galavā
(||nīve||)
sigurāgu gĕmmāvi sĕṁchuvāramu nīgu
vŏgarai tom̐ṭunemĕ vŏddurā nemu
sŏgusuleḽlavaṁṭisūbulu māvi pĕkku
vagalai minnulam̐ bārī vaṁchugŏnam̐galavā
(||nīve||)
saravi kŏṁḍalavaṁṭi sannulanemu nī-
vuramĕlla nŏttum̐jesu nŏddurā nemu
kariguṁbhamulavaṁṭi kaḍidaḍamu yī-
aridi naḍavivāri nābam̐ galavā
(||nīve||)
sillĕradīgĕlavaṁṭi sedulu māvi nī-
vŏḽlĕlla naraḍum̐jesu vŏddurā nemu
mĕllane śhrī veṁkaḍeśha megŏlibi kūḍidivi
ballidum̐ḍa vaudugāga paṁtamāḍam̐galavā