నీవే తెలుసుకొమ్మీ నీ సుద్దులు
(॥పల్లవి॥)
నీవే తెలుసుకొమ్మీ నీ సుద్దులు
రావిచిగురంటుకొంటే రాఁ బోను వచ్చునా
(॥నీవే॥)
పొందుగాని గొల్లెతల పొందు నీవు సేసితేను
నింద రాక మానునా నీకైనాను
అందముగ నిన్ను వారియంగములు సోఁకితేను
విందువలె గొల్లముంజు వేయకుండీనా
(॥నీవే॥)
కూడగొట్టు వనితల కోరి పెండ్లాడితేను
ఆడుకోకుండుదురా అంగళ్ల నెల్ల
ఆడవారు తమతమ అధరములు మోవీఁగా
యీడులేని నీ మోవి యెంగిలి గాకుండునా
(॥నీవే॥)
యియ్యని రాచకూఁతు నెత్తుకొని వచ్చితేను
నెయ్యపు శ్రీవేంకటేశ నిన్ను నవ్వరా
యియ్యెడ నన్నుఁ గూడే వీపె నింత సేసితేను
వుయ్యాలగా రొమ్ముదొక్కి వుండ కిట్టే మానునా
(||pallavi||)
nīve tĕlusugŏmmī nī suddulu
rāvisiguraṁṭugŏṁṭe rām̐ bonu vachchunā
(||nīve||)
pŏṁdugāni gŏllĕdala pŏṁdu nīvu sesidenu
niṁda rāga mānunā nīgainānu
aṁdamuga ninnu vāriyaṁgamulu som̐kidenu
viṁduvalĕ gŏllamuṁju veyaguṁḍīnā
(||nīve||)
kūḍagŏṭṭu vanidala kori pĕṁḍlāḍidenu
āḍugoguṁḍudurā aṁgaḽla nĕlla
āḍavāru tamadama adharamulu movīm̐gā
yīḍuleni nī movi yĕṁgili gāguṁḍunā
(||nīve||)
yiyyani rāsagūm̐tu nĕttugŏni vachchidenu
nĕyyabu śhrīveṁkaḍeśha ninnu navvarā
yiyyĕḍa nannum̐ gūḍe vībĕ niṁta sesidenu
vuyyālagā rŏmmudŏkki vuṁḍa kiṭṭe mānunā