Neeve sana vichchidivo nelamta garvamo yidi

నీవే చన విచ్చితివో నెలఁత గర్వమో యిది
Language

(॥పల్లవి॥)
నీవే చన విచ్చితివో నెలఁత గర్వమో యిది
వావాఁత మాఁటలాడి వలపుచల్లీ నిదె

(॥నీవే॥)
మొకమెత్తి చూచీని నీ మోహన ముద్దుచూపీని
నకనకవాడి వాడి నవ్వు నవ్వీని
చికురము దువ్విదువ్వి చేసన్న సేసీని
యెకసక్కెమో నాతో నెవ్వతెరా నేఁడు

(॥నీవే॥)
కన్నులు దేలవేసీని కడుఁగేకరించీని
చన్నుమొనలు చూపీన జరసీని
కిన్నెరలు మీఁటీని కిందుపడి మొక్కీని
యిన్నేసి మాయలు సేసీ నెవ్వతెరా యిది

(॥నీవే॥)
కప్పురవిడె మిచ్చీని కాఁగిలించవచ్చీని
నెప్పున శ్రీవేంకటేశ నీతో నిదె
అప్పుడే నన్నుఁగూడితి వండ నేనూ నున్నదాన
చిప్పిలీ నిదెవ్వతెరా సిగ్గువడ దిపుడు

(||pallavi||)
nīve sana vichchidivo nĕlam̐ta garvamo yidi
vāvām̐ta mām̐ṭalāḍi valabusallī nidĕ

(||nīve||)
mŏgamĕtti sūsīni nī mohana muddusūbīni
naganagavāḍi vāḍi navvu navvīni
siguramu duvviduvvi sesanna sesīni
yĕgasakkĕmo nādo nĕvvadĕrā nem̐ḍu

(||nīve||)
kannulu delavesīni kaḍum̐gegariṁchīni
sannumŏnalu sūbīna jarasīni
kinnĕralu mīm̐ṭīni kiṁdubaḍi mŏkkīni
yinnesi māyalu sesī nĕvvadĕrā yidi

(||nīve||)
kappuraviḍĕ michchīni kām̐giliṁchavachchīni
nĕppuna śhrīveṁkaḍeśha nīdo nidĕ
appuḍe nannum̐gūḍidi vaṁḍa nenū nunnadāna
sippilī nidĕvvadĕrā sigguvaḍa dibuḍu