నీవే పాడిపంతాలకు నేరుపరివి
(॥పల్లవి॥)
నీవే పాడిపంతాలకు నేరుపరివి
కైవసము చేసుకొని కలపే విద్దరిని
(॥॥)
మొగము చూచి చూచి మోవిలంచా లొడఁ బడి
తగవులుదిద్దేవు తరుణులకు
బిగిసి నీ విక్కువ చెప్పించుకొని వొండొరుల
జగడాలు దీర్చి తీర్చి సంతసముచేసేవు
(॥॥)
పొంచి చనుజక్కవల పొందులపూఁటలు గొని
కంచముపొత్తు సేసేవు కాంతలను
మంచముపై నెక్కించుక మరి తారిఁ దమికించి
అంచెల నొక్కటిచేసి ఆదరించేవు
(॥॥)
వేడుకనవ్వులు నవ్వి విడే లిప్పించుకొని
జోడుగాఁ గాఁగిటఁ గూడి చొక్కించేవు
వోడక శ్రీ వేంకటేశ వురమున వీఁపునను
చేడెల నిలుపుకొని చెలుములు సేసేవు
(||pallavi||)
nīve pāḍibaṁtālagu nerubarivi
kaivasamu sesugŏni kalabe viddarini
(||||)
mŏgamu sūsi sūsi movilaṁchā lŏḍam̐ baḍi
tagavuludiddevu taruṇulagu
bigisi nī vikkuva sĕppiṁchugŏni vŏṁḍŏrula
jagaḍālu dīrsi tīrsi saṁtasamusesevu
(||||)
pŏṁchi sanujakkavala pŏṁdulabūm̐ṭalu gŏni
kaṁchamubŏttu sesevu kāṁtalanu
maṁchamubai nĕkkiṁchuga mari tārim̐ damigiṁchi
aṁchĕla nŏkkaḍisesi ādariṁchevu
(||||)
veḍuganavvulu navvi viḍe lippiṁchugŏni
joḍugām̐ gām̐giḍam̐ gūḍi sŏkkiṁchevu
voḍaga śhrī veṁkaḍeśha vuramuna vīm̐punanu
seḍĕla nilubugŏni sĕlumulu sesevu