నీవే నియామకుఁడవు నీవు దయానిధివి
(॥పల్లవి॥)
నీవే నియామకుఁడవు నీవు దయానిధివి
జీవులకు స్వతంత్ర మిచ్చితి విందుకొరకా
(॥నీవే॥)
అసురులకుఁ బాపము అమరులకుఁ బుణ్యము
పసగానే పంచిపెట్టి పనిగొనేవు
వసుధ నీ లీల కింతవలెనా తొల్లేకర్మము
పొసగ మంచిదిగానే బుద్ధి పుట్టించరాదా
(॥నీవే॥)
కౌరవులకు నోటమి కౌంతేయులకు జయము
యేరుపరచి చూచితివి యిరుదెసలా
సారెకు భూభారము దించఁగ నింతవలెనా
పోరు లేనివారినే పుట్టించరాదా
(॥నీవే॥)
జడుల కజ్ఞానము సజ్జనులకు విజ్ఞానము
అదరించి యేలితివి యందు నిందును
బడి శ్రీవేంకటేశ పాపపణ్యముల కింతేల
కడకూ మంచిదిగానే కరుణించరాదా
(||pallavi||)
nīve niyāmagum̐ḍavu nīvu dayānidhivi
jīvulagu svadaṁtra michchidi viṁdugŏragā
(||nīve||)
asurulagum̐ bābamu amarulagum̐ buṇyamu
pasagāne paṁchibĕṭṭi panigŏnevu
vasudha nī līla kiṁtavalĕnā tŏllegarmamu
pŏsaga maṁchidigāne buddhi puṭṭiṁcharādā
(||nīve||)
kauravulagu noḍami kauṁteyulagu jayamu
yerubarasi sūsidivi yirudĕsalā
sārĕgu bhūbhāramu diṁcham̐ga niṁtavalĕnā
poru lenivārine puṭṭiṁcharādā
(||nīve||)
jaḍula kajñānamu sajjanulagu vijñānamu
adariṁchi yelidivi yaṁdu niṁdunu
baḍi śhrīveṁkaḍeśha pābabaṇyamula kiṁtela
kaḍagū maṁchidigāne karuṇiṁcharādā