నీవే నేరుతువే నేరుపులన్నియుఁ జెలి
(॥పల్లవి॥)
నీవే నేరుతువే నేరుపులన్నియుఁ జెలి
కైవస మాతని నింతగాఁ జేసుకొంటివే
(॥నీవే॥)
తలఁపులో మెలఁగితే తగులాయమౌఁగాక
చలములు సాదించితే చవివుట్టీనా
చెలుములు సేసితేనే చెల్లుబడియౌఁగాక
బలుములు చూపితేను భావము గరఁగునా
(॥నీవే॥)
నవ్వులు నవ్వితేనే నాటుఁగాక ప్రియములు
రవ్వసేసితే సేవలు రతికెక్కీనా
వువ్విళ్లూరఁ బెనఁగితే వొనరుఁగాక వేడుక
దవ్పులను మాఁటాడితే తనివయ్యీనా
(॥నీవే॥)
వినయమే సేసితేను విచ్చనవిడియౌఁగాక
మనసియ్యకుండితేను మర్మమంటీనా
యెనసెను శ్రీవేంకటేశుఁ డింతలో నిన్ను
ననుపింత గాకుండితే నమ్మిక ఇంతౌనా
(||pallavi||)
nīve neruduve nerubulanniyum̐ jĕli
kaivasa mādani niṁtagām̐ jesugŏṁṭive
(||nīve||)
talam̐pulo mĕlam̐gide tagulāyamaum̐gāga
salamulu sādiṁchide savivuṭṭīnā
sĕlumulu sesidene sĕllubaḍiyaum̐gāga
balumulu sūbidenu bhāvamu garam̐gunā
(||nīve||)
navvulu navvidene nāḍum̐gāga priyamulu
ravvaseside sevalu radigĕkkīnā
vuvviḽlūram̐ bĕnam̐gide vŏnarum̐gāga veḍuga
davpulanu mām̐ṭāḍide tanivayyīnā
(||nīve||)
vinayame sesidenu vichchanaviḍiyaum̐gāga
manasiyyaguṁḍidenu marmamaṁṭīnā
yĕnasĕnu śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo ninnu
nanubiṁta gāguṁḍide nammiga iṁtaunā