Neeve neruduvamma nem daadani dakkamgona

నీవే నేరుతువమ్మ నేఁ డాతని దక్కఁగొన
Language

(॥పల్లవి॥)
నీవే నేరుతువమ్మ నేఁ డాతని దక్కఁగొన
యీవల నిందుకే వురమెక్కించె నిన్నతఁడు

(॥నీవే॥)
మచ్చరమువిడిచినమానినికి అట్టెకదా
ముచ్చట తనవిభుఁడు మోహించును
చెచ్చెర నుపచారముచెప్పినయాపెకుఁగదా
అచ్చపుమన్ననలెల్లా నఱచేతితలోనివి

(॥నీవే॥)
పంతములాడనియట్టిపడఁతికి నిట్టెకదా
సంతతము రమణుఁడు జంటవాయఁడు
చెంతల నెప్పుడు సేవలుసేసినయాపెకుఁగదా
బంతినే ఆతం డెప్పుడుం బంపసేసును

(॥నీవే॥)
ఇచ్చకురాలై నయట్టిఇంతికి నీ కిట్టె కదా
వచ్చి శ్రీవేంకటేశుఁడు వలచి కూడె
తచ్చివేసి నీవంటితమిగలాపెకుఁ గదా
కచ్చుపెట్టి ఇతఁడిట్టె కైవశమై వుండును

(||pallavi||)
nīve neruduvamma nem̐ ḍādani dakkam̐gŏna
yīvala niṁduge vuramĕkkiṁchĕ ninnadam̐ḍu

(||nīve||)
machcharamuviḍisinamāninigi aṭṭĕgadā
muchchaḍa tanavibhum̐ḍu mohiṁchunu
sĕchchĕra nubasāramusĕppinayābĕgum̐gadā
achchabumannanalĕllā naṟasedidalonivi

(||nīve||)
paṁtamulāḍaniyaṭṭibaḍam̐tigi niṭṭĕgadā
saṁtadamu ramaṇum̐ḍu jaṁṭavāyam̐ḍu
sĕṁtala nĕppuḍu sevalusesinayābĕgum̐gadā
baṁtine ādaṁ ḍĕppuḍuṁ baṁpasesunu

(||nīve||)
ichchagurālai nayaṭṭiiṁtigi nī kiṭṭĕ kadā
vachchi śhrīveṁkaḍeśhum̐ḍu valasi kūḍĕ
tachchivesi nīvaṁṭidamigalābĕgum̐ gadā
kachchubĕṭṭi idam̐ḍiṭṭĕ kaivaśhamai vuṁḍunu