Neeve nerudu nem jese??? valabu

నీవే నేరుతు నేఁ జేసే??? వలపు
Language

(॥పల్లవి॥)
నీవే నేరుతు నేఁ జేసే??? వలపు
పూవు వంటిది గుణము బుద్ది చెప్పు నాకును

(॥నీవే॥)
పాడి మెప్పించేనంటే పలచన నాయెలుఁగు
కూడి మెప్పించేనంటే కుచములు గట్లు
ఆడి మెప్పించేనంటే అంగాలు నీచూపు లంటె
యీడుదానఁ గాను నీకు నేమి సేతు నిఁకను

(॥నీవే॥)
చెనకి మెప్పించేనంటే సిగ్గులే నానిలువెల్లా
తనివి మెప్పించేనంటే తమకించీ వయసులు
మనసిచ్చి మెప్పించితే మట్టుమీరె మోహము
నిన్ను(ను) నమ్మివున్నదాన నేరుపుమీ చేఁతలు

(॥నీవే॥)
చూపుల మెప్పించేనంటే సూదులకంటే వాండ్లు
తీపుల మెప్పించేనంటే తేనె నా మోవి
యేపున శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
యీ పనులకే మెచ్చితి యెంచకుమీ రతులు

(||pallavi||)
nīve nerudu nem̐ jese??? valabu
pūvu vaṁṭidi guṇamu buddi sĕppu nāgunu

(||nīve||)
pāḍi mĕppiṁchenaṁṭe palasana nāyĕlum̐gu
kūḍi mĕppiṁchenaṁṭe kusamulu gaṭlu
āḍi mĕppiṁchenaṁṭe aṁgālu nīsūbu laṁṭĕ
yīḍudānam̐ gānu nīgu nemi sedu nim̐kanu

(||nīve||)
sĕnagi mĕppiṁchenaṁṭe siggule nāniluvĕllā
tanivi mĕppiṁchenaṁṭe tamagiṁchī vayasulu
manasichchi mĕppiṁchide maṭṭumīrĕ mohamu
ninnu(nu) nammivunnadāna nerubumī sem̐talu

(||nīve||)
sūbula mĕppiṁchenaṁṭe sūdulagaṁṭe vāṁḍlu
tībula mĕppiṁchenaṁṭe tenĕ nā movi
yebuna śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
yī panulage mĕchchidi yĕṁchagumī radulu