(॥పల్లవి॥)
నీవే ననుఁ గరుణింతువు గాక
వేవేలకును నాకు విన్నపం బిదియే
(॥నీవే॥)
మొదల నాశక్తి యిమ్ములఁ బరీక్షించి మరి
చెదర కిటు రక్షించెద నంటివా
అదె యశక్తుఁడ నేను అజాగళస్తనము
అదియె పనికివచ్చు నంతియె నేను
(॥నీవే॥)
పలు నా స్వరూప స్వభావంబు లెఱిఁగి మరి
చెలఁగి నను రక్షించెద నంటివా
వెలిఁ గప్ప చిప్పందు వెండిభావన మించు
కలిగినంతే నా కల గుణంబు
(॥నీవే॥)
శ్రీ వేంకటేశ నీసేవ సేయఁగ మరి
జీవంబు నేలి పెంచెద నంటివా
మోపకె గోపురము మోచే ప్రతిమరీతి
తావులను నా స్వతంత్రము నిట్టిదే
(||pallavi||)
nīve nanum̐ garuṇiṁtuvu gāga
vevelagunu nāgu vinnabaṁ bidiye
(||nīve||)
mŏdala nāśhakti yimmulam̐ barīkṣhiṁchi mari
sĕdara kiḍu rakṣhiṁchĕda naṁṭivā
adĕ yaśhaktum̐ḍa nenu ajāgaḽastanamu
adiyĕ panigivachchu naṁtiyĕ nenu
(||nīve||)
palu nā svarūba svabhāvaṁbu lĕṟim̐gi mari
sĕlam̐gi nanu rakṣhiṁchĕda naṁṭivā
vĕlim̐ gappa sippaṁdu vĕṁḍibhāvana miṁchu
kaliginaṁte nā kala guṇaṁbu
(||nīve||)
śhrī veṁkaḍeśha nīseva seyam̐ga mari
jīvaṁbu neli pĕṁchĕda naṁṭivā
mobagĕ goburamu mose pradimarīdi
tāvulanu nā svadaṁtramu niṭṭide