నీవె నన్నుఁ జూచి కరుణించేవు గాక
(॥పల్లవి॥)
నీవె నన్నుఁ జూచి కరుణించేవు గాక
కావరించి వేసరించఁ గలనా నేను
(॥నీవె॥)
నెయ్యమున నెవ్వతెతో నీవు పొందుసేసినాను
గయ్యాళిమాటలాడే కాంతనా నేను
చయ్యన విటుఁడవై యేజాడలఁ దిరిగినాను
కొయ్యవు నీవని దూరేగుణమా నాది
(॥నీవె॥)
వింత పెండ్లికొడుకవై వేడుకతో వచ్చితేను
పంతాన సాదించ నీతో బలిమా నేను
ఇంతలో వేరొకతె నీవింటికిఁ దెచ్చుకొంటేను
సంతల నీసుద్దులెల్లా చాటఁగ నోపుదునా
(॥నీవె॥)
వలచి నీ వెవ్వరివాకిటఁ గాచుకుండినా
కొలఁదిమీరి నిన్నాడుకొనేనా నేను
అలమేల్ మంగను నేను అట్టె శ్రీవెంకటేశ్వర
కలసితి విటు నన్ను కరకరించేనా
(||pallavi||)
nīvĕ nannum̐ jūsi karuṇiṁchevu gāga
kāvariṁchi vesariṁcham̐ galanā nenu
(||nīvĕ||)
nĕyyamuna nĕvvadĕdo nīvu pŏṁdusesinānu
gayyāḽimāḍalāḍe kāṁtanā nenu
sayyana viḍum̐ḍavai yejāḍalam̐ diriginānu
kŏyyavu nīvani dūreguṇamā nādi
(||nīvĕ||)
viṁta pĕṁḍligŏḍugavai veḍugado vachchidenu
paṁtāna sādiṁcha nīdo balimā nenu
iṁtalo verŏgadĕ nīviṁṭigim̐ dĕchchugŏṁṭenu
saṁtala nīsuddulĕllā sāḍam̐ga nobudunā
(||nīvĕ||)
valasi nī vĕvvarivāgiḍam̐ gāsuguṁḍinā
kŏlam̐dimīri ninnāḍugŏnenā nenu
alamel maṁganu nenu aṭṭĕ śhrīvĕṁkaḍeśhvara
kalasidi viḍu nannu karagariṁchenā