Neeve nannu nitte mannimchevu gaaga

నీవే నన్ను నిట్టె మన్నించేవు గాక
Language

(॥పల్లవి॥)
నీవే నన్ను నిట్టె మన్నించేవు గాక
భావించి నీతో నింత పదరఁగనేఁటికి

(॥నీవే॥)
కన్నులఁజూచిననీవు కరుణించనేరవా
విన్నప మేమిసేసేము వేగినంతాను
సన్నఁగొలిపించుకొని చనవియ్యనేరవా
ఇన్నిటా నిన్నుఁ గొసరి యెచ్చరించనేఁటికి

(॥నీవే॥)
మాట లాడినవాఁడవు మరుగఁగనేరవా
చీటికి మాటికి నిన్నుఁ జెనకనేల
యీటునఁ బాదాలు చాఁచి యెనయఁగనేరవా
చోటిమ్మని యప్పటిని సొలయనేమిటికి

(॥నీవే॥)
నవ్వినవాఁడవు నాతో నంటుసేయనేరవా
రవ్వసేసి నీమతి కరఁచనేఁటికి
యివ్వల శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
వువ్విళ్లూరఁ గూడితివి వొరయఁగనేఁటికి

(||pallavi||)
nīve nannu niṭṭĕ manniṁchevu gāga
bhāviṁchi nīdo niṁta padaram̐ganem̐ṭigi

(||nīve||)
kannulam̐jūsinanīvu karuṇiṁchaneravā
vinnaba memisesemu veginaṁtānu
sannam̐gŏlibiṁchugŏni sanaviyyaneravā
inniḍā ninnum̐ gŏsari yĕchchariṁchanem̐ṭigi

(||nīve||)
māḍa lāḍinavām̐ḍavu marugam̐ganeravā
sīḍigi māḍigi ninnum̐ jĕnaganela
yīḍunam̐ bādālu sām̐si yĕnayam̐ganeravā
soḍimmani yappaḍini sŏlayanemiḍigi

(||nīve||)
navvinavām̐ḍavu nādo naṁṭuseyaneravā
ravvasesi nīmadi karam̐sanem̐ṭigi
yivvala śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
vuvviḽlūram̐ gūḍidivi vŏrayam̐ganem̐ṭigi