Neeve nannu mannimchevu nem gosare demunnadi

నీవే నన్ను మన్నించేవు నేఁ గొసరే దేమున్నది
Language

(॥పల్లవి॥)
నీవే నన్ను మన్నించేవు నేఁ గొసరే దేమున్నది
యీవలనావల నిన్ను నెచ్చరించనేఁటికి

(॥నీవే॥)
చక్కనినిన్నుఁ జూచి సతులు వలతురేకా
మక్కువ నీవు వారి మానరాదుగా
యెక్కువగా నిందరిలో నేలేవని వుందానఁగా
ఇక్కడ నాభాగ్యము యెంచఁగనేమిటికి

(॥నీవే॥)
మదనగోపాలుఁడవై మర్మాలు గలఁతువుగా
పొదుగక ఇంతులకుఁ బోరాదుగా
అదనఁ బట్టపుదేవి నయ్యేనని మొక్కితిఁగా
పదిమారులును నీతోఁ బచారించనేఁటికి

(॥నీవే॥)
ఇదె శ్రీవేంకటేశ్వర యిరవై వున్నాఁడవుగా
పదారువేలు కాంతలపతివైతిగా
అదన నలమేల్ మంగనైననేఁ గూడితిఁగా
అదివో నీసుద్దులు నే నడుగఁగనేఁటికి

(||pallavi||)
nīve nannu manniṁchevu nem̐ gŏsare demunnadi
yīvalanāvala ninnu nĕchchariṁchanem̐ṭigi

(||nīve||)
sakkanininnum̐ jūsi sadulu valaduregā
makkuva nīvu vāri mānarādugā
yĕkkuvagā niṁdarilo nelevani vuṁdānam̐gā
ikkaḍa nābhāgyamu yĕṁcham̐ganemiḍigi

(||nīve||)
madanagobālum̐ḍavai marmālu galam̐tuvugā
pŏdugaga iṁtulagum̐ borādugā
adanam̐ baṭṭabudevi nayyenani mŏkkidim̐gā
padimārulunu nīdom̐ basāriṁchanem̐ṭigi

(||nīve||)
idĕ śhrīveṁkaḍeśhvara yiravai vunnām̐ḍavugā
padāruvelu kāṁtalabadivaidigā
adana nalamel maṁganainanem̐ gūḍidim̐gā
adivo nīsuddulu ne naḍugam̐ganem̐ṭigi