Neeve naavaamdavaide niluvunam gaanaraadaa

నీవే నావాఁడవైతే నిలువునఁ గానరాదా
Language

(॥పల్లవి॥)
నీవే నావాఁడవైతే నిలువునఁ గానరాదా
భావించి అప్పటి నాతోఁ బచరించవలెనా

(॥నీవే॥)
ప్రియమే నీకుఁ గలిగితే పిలువ నంపకుండే వాఁడవా
దయకుఁ దగినపాటె తగులు గాక
నియతాన నట్టె నాపై నీవేల ఆన వెట్టేవు
క్రియ యెరఁగనా నేను కిందుపడవలెనా

(॥నీవే॥)
నేనే నీకు వలసితే నీవిందాఁకా రాకుందువా
పాని పట్టి యాపాటికాపాటే గాక
నానఁ బెట్టి నీవేల నన్ను నవ్వించ వచ్చేవు
కాననా నీవలపులు గట్టిసేయవలెనా

(॥నీవే॥)
చిత్తమే నాపైనుండితే చేపట్టి తియ్యకుండేవా
యిత్తల నీ నాటకము లేఁటివో కాక
హత్తి శ్రీవేంకటేశ్వర అట్టె నన్నుఁ గూడితివి
పొత్తుకు నే రాకుండేనా పొదుగఁగ వలెనా

(||pallavi||)
nīve nāvām̐ḍavaide niluvunam̐ gānarādā
bhāviṁchi appaḍi nādom̐ basariṁchavalĕnā

(||nīve||)
priyame nīgum̐ galigide piluva naṁpaguṁḍe vām̐ḍavā
dayagum̐ daginabāḍĕ tagulu gāga
niyadāna naṭṭĕ nābai nīvela āna vĕṭṭevu
kriya yĕram̐ganā nenu kiṁdubaḍavalĕnā

(||nīve||)
nene nīgu valaside nīviṁdām̐kā rāguṁduvā
pāni paṭṭi yābāḍigābāḍe gāga
nānam̐ bĕṭṭi nīvela nannu navviṁcha vachchevu
kānanā nīvalabulu gaṭṭiseyavalĕnā

(||nīve||)
sittame nābainuṁḍide sebaṭṭi tiyyaguṁḍevā
yittala nī nāḍagamu lem̐ṭivo kāga
hatti śhrīveṁkaḍeśhvara aṭṭĕ nannum̐ gūḍidivi
pŏttugu ne rāguṁḍenā pŏdugam̐ga valĕnā