నీవే నాపై బత్తి యైతే నేఁడి ట్లేఁటి కయ్యీ
(॥పల్లవి॥)
నీవే నాపై బత్తి యైతే నేఁడి ట్లేఁటి కయ్యీ
కావరపు నీ బత్తి కల్ల యేమో కాక
(॥నీవే॥)
కొప్పు వీడెఁ గదరా కోరి నీవు మొక్కఁగాను
వొప్పుగా నే నీకు మొక్కే దొమ్మదో కాక
దప్పి గొంటిఁ గదరా తగ నీతో నవ్వఁగాను
అప్పటి నీతో నవ్వు లయి రావో కాక
(॥నీవే॥)
కాలు జారెఁ గదరా కమ్మి నీ కెదురు రాఁగ
తూలుచు నీ తెరువు రా దోసమో కాక
వోలిఁ జెమరించెరా వొగి నిన్నుఁ జూడగాను
తాలిమి నిన్నుఁ జూచేది తగనిదో కాక
(॥నీవే॥)
కాఁక రేఁగెఁ గదరా కాఁగిట నిన్నుఁ బట్టఁగ
వేఁకపు నీతో రతి వెంగెమో కాక
యేఁకట శ్రీ వెంకటేశ యిత వాయఁ గదరా
మాఁకు పడ మరుఁ డింత మరిపెనో కాక
(||pallavi||)
nīve nābai batti yaide nem̐ḍi ṭlem̐ṭi kayyī
kāvarabu nī batti kalla yemo kāga
(||nīve||)
kŏppu vīḍĕm̐ gadarā kori nīvu mŏkkam̐gānu
vŏppugā ne nīgu mŏkke dŏmmado kāga
dappi gŏṁṭim̐ gadarā taga nīdo navvam̐gānu
appaḍi nīdo navvu layi rāvo kāga
(||nīve||)
kālu jārĕm̐ gadarā kammi nī kĕduru rām̐ga
tūlusu nī tĕruvu rā dosamo kāga
volim̐ jĕmariṁchĕrā vŏgi ninnum̐ jūḍagānu
tālimi ninnum̐ jūsedi taganido kāga
(||nīve||)
kām̐ka rem̐gĕm̐ gadarā kām̐giḍa ninnum̐ baṭṭam̐ga
vem̐kabu nīdo radi vĕṁgĕmo kāga
yem̐kaḍa śhrī vĕṁkaḍeśha yida vāyam̐ gadarā
mām̐ku paḍa marum̐ ḍiṁta maribĕno kāga