Neeve mannimchidenu nirmalaana numdumgaaga

నీవే మన్నించితేను నిర్మలాన నుందుఁగాక
Language

(॥పల్లవి॥)
నీవే మన్నించితేను నిర్మలాన నుందుఁగాక
వేవేలకు నిన్ను దూరి విసుగఁ జోటున్నదా

(॥నీవే॥)
చెలులేమి సేసేరు చేరి నీవు రాకుండితే
కొలనిఆమేలు గట్టుకొందువు గాక
నెలవైనవలపుతో నీకు నే నెదురుచూచి
పలము గొనుటే కాక బలిమి నా కున్నదో

(॥నీవే॥)
మరుఁ డేమి సేసీని మనసు నీకు రాకున్న
యిరవై నీ వేక రాజ్య మేలుదు గాక
పరగ నీకు వలచి పానుపుపైఁ బొరలుతా
వెర వెంచుకొందు గాక వేగిరించఁ గలనా

(॥నీవే॥)
చక్కఁదనా లేమి సేసీ చనవు నీ వియ్యకున్న
గుక్కక నీవిట్టె బదుకుదువు గాక
నిక్కి శ్రీవేంకటేశుఁడ నేఁడు నన్నుఁ గూడితివి
వొక్కమనసైతిఁ గాక వున్నసుద్దు లేఁటికి

(||pallavi||)
nīve manniṁchidenu nirmalāna nuṁdum̐gāga
vevelagu ninnu dūri visugam̐ joḍunnadā

(||nīve||)
sĕlulemi seseru seri nīvu rāguṁḍide
kŏlaniāmelu gaṭṭugŏṁduvu gāga
nĕlavainavalabudo nīgu ne nĕdurusūsi
palamu gŏnuḍe kāga balimi nā kunnado

(||nīve||)
marum̐ ḍemi sesīni manasu nīgu rāgunna
yiravai nī vega rājya meludu gāga
paraga nīgu valasi pānububaim̐ bŏraludā
vĕra vĕṁchugŏṁdu gāga vegiriṁcham̐ galanā

(||nīve||)
sakkam̐danā lemi sesī sanavu nī viyyagunna
gukkaga nīviṭṭĕ baduguduvu gāga
nikki śhrīveṁkaḍeśhum̐ḍa nem̐ḍu nannum̐ gūḍidivi
vŏkkamanasaidim̐ gāga vunnasuddu lem̐ṭigi