Neeve mamchivaamda vayya nene veeridim gaani

నీవే మంచివాఁడ వయ్య నేనే వీరిడిఁ గాని
Language

(॥పల్లవి॥)
నీవే మంచివాఁడ వయ్య నేనే వీరిడిఁ గాని
భావించి నా మంకు నేనే పాపఁగల నింకను

(॥నీవే॥)
సారె సారె నిన్ను దూరి సణఁగులే యాడితిని
భారపు నీసతులకుఁ బగ యైతిని
యీరీతి నిన్నుఁ జేసి యేఁటిజన్మ మెత్తితినో
తేరకొన నన్ను నేనే తిట్టుకొంటి నిందుకు

(॥నీవే॥)
కపటాన నీమీఁద గబ్బిచూపు చూచితిని
కపురుల నీమనసు గలఁచితిని
యిపు డిందు కొడిగట్టి యెందుకు మంచిదాననో
వుపమించి నాకు నాకే వుస్సు రంటి నేను

(॥నీవే॥)
ఱట్టుగఁ నిన్నుఁ గూడి యుఱక యలయించితిని
కట్టఁగడ నిన్నుఁ దిరుగ నీనైతిని
యిట్టినన్ను శ్రీవెంకటేశ నేఁడు గూడితివి
నట్టనడమ నిందుకే నవ్వుకొంటి నేనూ

(||pallavi||)
nīve maṁchivām̐ḍa vayya nene vīriḍim̐ gāni
bhāviṁchi nā maṁku nene pābam̐gala niṁkanu

(||nīve||)
sārĕ sārĕ ninnu dūri saṇam̐gule yāḍidini
bhārabu nīsadulagum̐ baga yaidini
yīrīdi ninnum̐ jesi yem̐ṭijanma mĕttidino
teragŏna nannu nene tiṭṭugŏṁṭi niṁdugu

(||nīve||)
kabaḍāna nīmīm̐da gabbisūbu sūsidini
kaburula nīmanasu galam̐sidini
yibu ḍiṁdu kŏḍigaṭṭi yĕṁdugu maṁchidānano
vubamiṁchi nāgu nāge vussu raṁṭi nenu

(||nīve||)
ṟaṭṭugam̐ ninnum̐ gūḍi yuṟaga yalayiṁchidini
kaṭṭam̐gaḍa ninnum̐ diruga nīnaidini
yiṭṭinannu śhrīvĕṁkaḍeśha nem̐ḍu gūḍidivi
naṭṭanaḍama niṁduge navvugŏṁṭi nenū