నీవే కానింక నే నన్యమెఱఁగ యే
(॥పల్లవి॥)
నీవే కానింక నే నన్యమెఱఁగ యే-
త్రోవ చూపి నాకుఁ దోడయ్యెదవయ్య
(॥నీవేకా॥)
అపరాధనత కోట్లయినవి వొక్క-
నెపమున ననుఁ గావనేరవా
అపరిమితదురితా లైనవి యే-
ఉపమచేత నన్ను నుద్దరించెదవయ్య
(॥నీవేకా॥)
అతిశయముగఁ గర్మినైతిని నీ-
మతము నాకొకయింత మరపవా
ఇతర కర్మారంభహితుఁడను
గతి మోక్ష మెటువలెఁ గల్పించెదవయ్య
(॥నీవేకా॥)
తిరువేంకటాచలాధీశ్వరా నీ-
శరణాగతులఁ బ్రోవఁజాలవా
పరమదయానందపరుఁడవు యే-
వెరవున భవములు వెడలఁ ద్రోచెదవయ్య
(||pallavi||)
nīve kāniṁka ne nanyamĕṟam̐ga ye-
trova sūbi nāgum̐ doḍayyĕdavayya
(||nīvegā||)
abarādhanada koṭlayinavi vŏkka-
nĕbamuna nanum̐ gāvaneravā
abarimidaduridā lainavi ye-
ubamaseda nannu nuddariṁchĕdavayya
(||nīvegā||)
adiśhayamugam̐ garminaidini nī-
madamu nāgŏgayiṁta marabavā
idara karmāraṁbhahidum̐ḍanu
gadi mokṣha mĕḍuvalĕm̐ galbiṁchĕdavayya
(||nīvegā||)
tiruveṁkaḍāsalādhīśhvarā nī-
śharaṇāgadulam̐ brovam̐jālavā
paramadayānaṁdabarum̐ḍavu ye-
vĕravuna bhavamulu vĕḍalam̐ drosĕdavayya