Neeve jaanavaide ninnu mechchenu

నీవే జాణవైతే నిన్ను మెచ్చేను
Language

(॥పల్లవి॥)
నీవే జాణవైతే నిన్ను మెచ్చేను
ఆవల నెమ్మెలూరక ఆడుకోకువే

(॥నీవే॥)
చలువయినదెయ్యది చవులలోనేది చవి
తలఁపులోననేది దగిలియుండు
చెలఁగు మోమేమిట చిఱునవ్వెప్పుడు వచ్చు
వలపెరిఁగితే నిది వర్ణించవే

(॥నీవే॥)
ఆసలేమిట నిండు ఆయమేమిటఁ గరఁగు
బాలెందాఁకాను పనికి వచ్చు
యీసులేరీతిఁ దీరు యింపులేగతిఁబుట్టు
వాసి నేర్పులు గలితే వర్ణించవే

(॥నీవే॥)
చింతలేమిటఁ బాయు సిగ్గులేవల్లఁ దీరు
పంతమెందుల వచ్చు పనిగొంటేను
యింతలో శ్రీ వేంకటేశుఁడిటు నన్ను నిన్నుఁ గూడె
వంతుదానవై తేను వర్ణించవే

(||pallavi||)
nīve jāṇavaide ninnu mĕchchenu
āvala nĕmmĕlūraga āḍugoguve

(||nīve||)
saluvayinadĕyyadi savulalonedi savi
talam̐pulonanedi dagiliyuṁḍu
sĕlam̐gu momemiḍa siṟunavvĕppuḍu vachchu
valabĕrim̐gide nidi varṇiṁchave

(||nīve||)
āsalemiḍa niṁḍu āyamemiḍam̐ garam̐gu
bālĕṁdām̐kānu panigi vachchu
yīsulerīdim̐ dīru yiṁpulegadim̐buṭṭu
vāsi nerbulu galide varṇiṁchave

(||nīve||)
siṁtalemiḍam̐ bāyu siggulevallam̐ dīru
paṁtamĕṁdula vachchu panigŏṁṭenu
yiṁtalo śhrī veṁkaḍeśhum̐ḍiḍu nannu ninnum̐ gūḍĕ
vaṁtudānavai tenu varṇiṁchave