Neeve jaana namdu vaabe neegamtem gadu jaana

నీవే జాణ నందు వాపె నీకంటేఁ గడు జాణ
Language

(॥పల్లవి॥)
నీవే జాణ నందు వాపె నీకంటేఁ గడు జాణ
యే విదాన నీపంతా లిఁక నీడఁ జెల్లవూ

(॥నీవే॥)
కలికి పువ్వులచెండు కన్నులనె అద్దుకొంటా
వలపుతో వసివాడు వాడుకొంటాను
అలిగినదిఁ గాక అట్టె కూడినది గాక
మలయుచు చెలులతో మాఁటలాడీ నదివో

(॥నీవే॥)
పదిమారులును నిమ్మపం డెగర వేసుకొంటా
చెదరినచింతతోఁ జింతించుకొంటా
యెదుట నున్నది గాక యెడసినదిఁ గాక
వొదిగి మలగుపై నొరగీ నదివో

(॥నీవె॥)
మక్కువ యంతో వడికి మడిచినా కందుకొంటా
అక్కరతో వుస్సు రస్సు రనుకొంటాను
యిక్కు వంటినదిఁ గాక యియ్యకొన్నదిఁ గాక
గక్కన శ్రీవెంకటేశ కాఁగిలించె నదివో

(||pallavi||)
nīve jāṇa naṁdu vābĕ nīgaṁṭem̐ gaḍu jāṇa
ye vidāna nībaṁtā lim̐ka nīḍam̐ jĕllavū

(||nīve||)
kaligi puvvulasĕṁḍu kannulanĕ addugŏṁṭā
valabudo vasivāḍu vāḍugŏṁṭānu
aliginadim̐ gāga aṭṭĕ kūḍinadi gāga
malayusu sĕlulado mām̐ṭalāḍī nadivo

(||nīve||)
padimārulunu nimmabaṁ ḍĕgara vesugŏṁṭā
sĕdarinasiṁtadom̐ jiṁtiṁchugŏṁṭā
yĕduḍa nunnadi gāga yĕḍasinadim̐ gāga
vŏdigi malagubai nŏragī nadivo

(||nīvĕ||)
makkuva yaṁto vaḍigi maḍisinā kaṁdugŏṁṭā
akkarado vussu rassu ranugŏṁṭānu
yikku vaṁṭinadim̐ gāga yiyyagŏnnadim̐ gāga
gakkana śhrīvĕṁkaḍeśha kām̐giliṁchĕ nadivo