నీవే ఇంతసేయఁ గాను నే మాపెను దూరేదేమి
(॥పల్లవి॥)
నీవే ఇంతసేయఁ గాను నే మాపెను దూరేదేమి
వోవలఁ బెట్టఁగా నాపె వోజ చక్కనయ్యీనా
(॥॥)
సంగడిఁ బెట్టుక నీవు సరసములాడఁగాను
కంగి యాపె సవతులఁ గైకొనీనా
అంగవించి మూలనుంచు కాపె నీవు పూజించఁ గా
సంగతి నెవ్వరినైనా సరకుగొనీనా
(॥॥)
ప్రియపడి నీవే ఇంత పెద్దరికానఁ బెంచఁగా
నయాన వినయా లాపె నాకుఁ జేసీనా
దయతో నాపెగుణాలు తగ నీవు వొగడఁ గా
నియతాన వంచనలు నేరఁ బోయీనాఁ
(॥॥)
వలచి యాపెకు నీవు వసమై వుండఁ గాను
తిలకించి మొక్కినా తేరిచూచీనా
అలమేలుమంగపతివైనశ్రీ వేంకటేశ్వర
యిల నన్నుఁ గూడితివి యీకె మెచ్చకుండీనా
(||pallavi||)
nīve iṁtaseyam̐ gānu ne mābĕnu dūredemi
vovalam̐ bĕṭṭam̐gā nābĕ voja sakkanayyīnā
(||||)
saṁgaḍim̐ bĕṭṭuga nīvu sarasamulāḍam̐gānu
kaṁgi yābĕ savadulam̐ gaigŏnīnā
aṁgaviṁchi mūlanuṁchu kābĕ nīvu pūjiṁcham̐ gā
saṁgadi nĕvvarinainā saragugŏnīnā
(||||)
priyabaḍi nīve iṁta pĕddarigānam̐ bĕṁcham̐gā
nayāna vinayā lābĕ nāgum̐ jesīnā
dayado nābĕguṇālu taga nīvu vŏgaḍam̐ gā
niyadāna vaṁchanalu neram̐ boyīnām̐
(||||)
valasi yābĕgu nīvu vasamai vuṁḍam̐ gānu
tilagiṁchi mŏkkinā terisūsīnā
alamelumaṁgabadivainaśhrī veṁkaḍeśhvara
yila nannum̐ gūḍidivi yīgĕ mĕchchaguṁḍīnā