Neeve idi dalamsi mannimchidivi javaraali

నీవే ఇది దలఁచి మన్నించితివి జవరాలి
Language

(॥పల్లవి॥)
నీవే ఇది దలఁచి మన్నించితివి జవరాలి
భావించి యెంతని మెచ్చి పలికేము నిన్నును

(॥నీవే॥)
నయాన గారవించితే నంటుసేతురు చెలులు
ప్రియములు చూపేతేను బెరయుదురు
నియతమే నడపితే నెట్టుకొని వలతురు
యెరిఁగి మగవాఁ డంకెల నేలవలెను

(॥నీవే॥)
ఇచ్చగించి కూడితేను ఇంపుసేతురు సతులు
మచ్చికలు చల్లితేను మరుగుదురు
అచ్చలాన నవ్వితేనే ఆయాలు గరఁగుదురు
కచ్చుపట్టి నాయకుఁడే కరుణించవలెను

(॥నీవే॥)
చనవిచ్చి యేలితేను సతమౌదురు కాంతలు
ననుపు నటించితేను నమ్ముదురు
యెనసితివి శ్రీవేంకటేశ యింతలో నీకెను
వనితకుఁ బతి విటువలెనే కావలెను

(||pallavi||)
nīve idi dalam̐si manniṁchidivi javarāli
bhāviṁchi yĕṁtani mĕchchi paligemu ninnunu

(||nīve||)
nayāna gāraviṁchide naṁṭuseduru sĕlulu
priyamulu sūbedenu bĕrayuduru
niyadame naḍabide nĕṭṭugŏni valaduru
yĕrim̐gi magavām̐ ḍaṁkĕla nelavalĕnu

(||nīve||)
ichchagiṁchi kūḍidenu iṁpuseduru sadulu
machchigalu sallidenu maruguduru
achchalāna navvidene āyālu garam̐guduru
kachchubaṭṭi nāyagum̐ḍe karuṇiṁchavalĕnu

(||nīve||)
sanavichchi yelidenu sadamauduru kāṁtalu
nanubu naḍiṁchidenu nammuduru
yĕnasidivi śhrīveṁkaḍeśha yiṁtalo nīgĕnu
vanidagum̐ badi viḍuvalĕne kāvalĕnu