నీవే ఘనుఁడవు నే నొక దేహిని
(॥పల్లవి॥)
నీవే ఘనుఁడవు నే నొక దేహిని
యేవలఁ గాచుట యెన్నిక నీకు
(॥నీవే॥)
మొక్కినఁ దీరును మోచిన తప్పులు, అని
మొక్కెద నీ పాదములకు నిదే
చిక్కినవారిపై చేరి దయ గలుగు, అని
చిక్కితి నిటు నీ చేతికి నేను
(॥నీవే॥)
చెప్పినఁ బాయును నేసిన పాపము, అని
చెప్పెద నా దుష్టుచేఁత లివే
యెప్పుడు చనవరి యెంగిలి దిన్నను
చిప్పిలుఁ బ్రసాద జీవిని నేను
(॥నీవే॥)
కొలిచిన పతి చేకొని రక్షించును అని
కొలిచితి నీ డాగులు మోచి
యెలమి శ్రీవేంకటేశ్వర నే నీకు
బలువగు సూత్రపు ప్రతిమను నేను
(||pallavi||)
nīve ghanum̐ḍavu ne nŏga dehini
yevalam̐ gāsuḍa yĕnniga nīgu
(||nīve||)
mŏkkinam̐ dīrunu mosina tappulu, ani
mŏkkĕda nī pādamulagu nide
sikkinavāribai seri daya galugu, ani
sikkidi niḍu nī sedigi nenu
(||nīve||)
sĕppinam̐ bāyunu nesina pābamu, ani
sĕppĕda nā duṣhṭusem̐ta live
yĕppuḍu sanavari yĕṁgili dinnanu
sippilum̐ brasāda jīvini nenu
(||nīve||)
kŏlisina padi segŏni rakṣhiṁchunu ani
kŏlisidi nī ḍāgulu mosi
yĕlami śhrīveṁkaḍeśhvara ne nīgu
baluvagu sūtrabu pradimanu nenu