నీవే బోధించి నన్ను నీవే యీడేర్తు గాక
(॥పల్లవి॥)
నీవే బోధించి నన్ను నీవే యీడేర్తు గాక
నా వంక నేమి గలరు నమో నారాయణా
(॥నీవే॥)
పంచిన నా కర్మములు పనులే బోధించుఁ గాక
పొంచిన శ్రీహరి నిన్ను బోధించీనా
తెంచరాని ఆసలివి తిమ్మటే బోధించుఁ గాక
కంచపు నీ దివ్యనామ కతలు బోధించీనా
(॥నీవే॥)
పొరలు యింద్రియములు భోగమే భోధించుఁ గాక
పురుషోత్తముఁడ నిన్ను బోధీంచీనా
సరుస నా యాకలిది చవులే బోదించుఁ గాక
నిరతి నీ కైంకర్యము నేఁడు బోధించీనా
(॥నీవే॥)
గాసిల్ల నామతి యహంకారమే భోధించుఁ గాక
భూసతీశ నిన్నుఁ గాన బోధించీనా
యీసుదీర శ్రీ వేంకటేశ నీకు నా గురుఁడు
దాసి బోధించుఁ గాక తప్పఁగా బోధించునా
(||pallavi||)
nīve bodhiṁchi nannu nīve yīḍerdu gāga
nā vaṁka nemi galaru namo nārāyaṇā
(||nīve||)
paṁchina nā karmamulu panule bodhiṁchum̐ gāga
pŏṁchina śhrīhari ninnu bodhiṁchīnā
tĕṁcharāni āsalivi timmaḍe bodhiṁchum̐ gāga
kaṁchabu nī divyanāma kadalu bodhiṁchīnā
(||nīve||)
pŏralu yiṁdriyamulu bhogame bhodhiṁchum̐ gāga
puruṣhottamum̐ḍa ninnu bodhīṁchīnā
sarusa nā yāgalidi savule bodiṁchum̐ gāga
niradi nī kaiṁkaryamu nem̐ḍu bodhiṁchīnā
(||nīve||)
gāsilla nāmadi yahaṁkārame bhodhiṁchum̐ gāga
bhūsadīśha ninnum̐ gāna bodhiṁchīnā
yīsudīra śhrī veṁkaḍeśha nīgu nā gurum̐ḍu
dāsi bodhiṁchum̐ gāga tappam̐gā bodhiṁchunā